-విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు , ఐ. పి. ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర ప్రజలకు, పోలీస్ సిబ్బంది మరియు అధికారులు యన్.టి.ఆర్. జిల్లా పోలీసు కమిషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు , ఐ. పి. ఎస్. 2025 వ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేది రాత్రి నిర్వహిoచుకొనే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకొని ఆంక్షలు తప్పని సరి చేయటమైనది. కావున ప్రజలు ఈ విషయాన్నీ గుర్తించి పోలీసులకు సహకరిస్తూ, పోలీసు కఠిన చర్యలు నుంచి దూరంగా వుండాలని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు, ఐ. పి. ఎస్ విజయవాడ ప్రజలకు విజ్ఞప్తి చేయట మైనది.
నగర ప్రజలకు సూచనలు
-అర్దరాత్రి రోడ్డుమీద వేడుకలకు అనుమతులు లేదు.
-రాత్రి 11 గంటల తరువాత వాహనములు నడుపు వ్యక్తి అతి వేఘంగా, అజాగ్రత్తగా వాహనము నడప రాదు.
-ట్రిపుల్ రైడింగ్ చేసి వాహనము నడుప రాదు.
-మద్యం సేవించి వాహనములు నడుప రాదు.
-ప్రధాన రహదారులు అయిన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బి.ఆర్.టి. ఎస్. రోడ్ల పై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించబడును.
-అదే విధంగా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు (కొత్త, పాత) , కనక దుర్గా ఫ్లైఓవర్ ల పై ట్రాఫిక్ అనుమతించ బడదు.
– వెస్ట్ బైపాస్ రోడ్డు లో ప్రయాణానికి పూర్తిగా ఆంక్షలు విధించడ మైనది. కాబట్టి అటువైపు ఎవరు వెళ్ళ రాదు మరియు నూతన సంవస్సర వేడుకలు జరుపుకోరాదు.
– గుoపులు గుంపులుగా చేరి నడి రోడ్డు పై కేకులు కోసి అల్లర్లు చేయరాదు.
– డిసెంబర్ 31వ తేది రాత్రివేళ కేకలు వేస్తూ వాహనములపై తిరుగ రాదు.
– హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు.
– డిసెంబర్ 31వ తేది రాత్రివేళ నగరంలో గస్తీ ముమ్మరంగా వుంటుంది.
ప్రత్యేక హెచ్చరిక
– మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
– మద్యం సేవించి వాహనములు నడిపిన వారిపై చర్యలు తీసుకోన బడును.
– ద్విచక్ర వాహనాలకు సైలంసర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరేత్తిoచడం, అతి వేఘం తో రోడ్ల పై తిరగటం, వాహనములు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణాసంచా పేల్చడం వంటి వాటివలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్దులకు, చిన్న పిల్లలకు , రోగులకు ఇబ్బంది కలుగుతుంది. కావున ఇలాంటి వాటికీ పాల్పడితే తగిన చర్యలు తీసుకోన బడును.
పై సూచనలను పాటించి నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకర వాతావరణం లో జాగ్రత్తగా రోడ్డు ప్రమాదములకు లోనుకాకుండా జరుపుకోవాలని ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి చేశారు.