
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ కమిషనర్ రేట్ ఎన్టీఆర్ జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు జనవరి 17 నుండి 23 వరకు”అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ప్రొగ్రాం ప్రారంభించడం జరిగింది. జనవరి 17 నుంచి 23 వరకు జరిగిన ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ “వారోత్సవాలలో వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు మరియు విజయ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు 500 మై భారత్ వాలంటీర్స్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈరోజు జనవరి 23 రోడ్డు భద్రత వారోత్సవాలలొ అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ప్రోగ్రాం ముగింపును స్థానిక వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సివిల్ సెమినార్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిపి కృష్ణమూర్తి నాయుడు విజయవాడ కమిషనర్ రేట్ వారు మాట్లాడుతూ మీ దైనందిన జీవితంలో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించుకోవాలని ప్రతి ఒక్కరూ మోటర్ వెహికల్ చట్టాల ప్రకారం లైసెన్సులు కలిగి ఉండి వెహికల్స్ ను నడపాలని మనస్సు శరీరం ఒకటిగా చేసుకుంటూ రోడ్డుపై కేవలం వాహనం నడపడంపై దృష్టి పెట్టాలని అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ సీట్ బెల్ట్ ని ధరిస్తూ వాహనాలని నడపాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ కమీషనర్ మోహన్ మాట్లాడుతూ మోటార్ వెహికల్ చట్టాలను కఠినంగా అమలు చేయడం అనేది సాధ్యమైనప్పటికీ ప్రజలను ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ వారిని చట్టాలకు అనుగుణంగా నడిపించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ ఈ కార్యక్రమం గత జనవరి 17 నుంచి 23 వరకు దిగ్విజయంగా నడిపించామని 500 మంది వాలంటీర్నీ టీ షర్ట్ క్యాప్ ధరించి ట్రాఫిక్ నందు డ్యూటీస్ చేయించి వారికి ఈ ఐదు రోజులు ట్రైనింగ్ ట్రాఫిక్ అంశాలపై ఇచ్చామని దీనికి సహకరించిన పోలీసు డిపార్ట్మెంట్ వారికి తన ధన్యవాదాలు అన్నారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివరామ గౌడ్ మరియు పెనమలూరు ఎస్సై లంక సురేష్ ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి కోళ్ల నరేంద్ర మరియు మైభారత్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా సందర్భంగా విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ ను అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News