-ఎమ్మెల్యే డి ఎన్ ఆర్
మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండవల్లి మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండవల్లి స్టేషన్ రోడ్డు అగ్రహారం మంచినీటి చెరువులోకి కొబ్బరికాయ కొట్టి మంచినీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవల్లి గ్రామ పంచాయతీ న్యూ బీసీ కాలనీ, అగ్రహారం, రైల్వే స్టేషన్ ఏరియా నివసించు వారికి
త్రాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామ సర్పంచ్ మెండ ఝాన్సీ,గ్రామ ప్రముఖ నాయకులు చేబోయిన వీరాజు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ (రాము ) సహకారంతో కొండరాయి చెరువు 5 లక్షలు రూపాయలు నిధులతో అభివృద్ధి చేసి ఈ రోజు నీరు విడుదల చేయడం చాలా సంతోషంగా వుందన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో 110 పంచాయతీలలో త్రాగునీరుకు ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో ప్రతి గ్రామ సర్పంచ్ కూడా మీ మీ గ్రామాలలో త్రాగునీరు పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని, అదేవిదంగా పైపు లైన్ పనులు ఎక్కడైనా మర్మమతులు ఉంటే తక్షణమే పనులు చేపించాలన్నారు. అదేవిదంగా గ్రామాలలో కోవిడ్ 19 పైన ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ వారు సామాజిక దూరం పాటించి మాస్క్లు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ శేషగిరిరావు,ఆర్డబ్ల్యూ ఏఈఈ కృష్ణారావు, నాయకులు వైస్ సర్పంచ్ జొన్నలగడ్డ నాగలక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షులు బొమ్మనబోయిన గోకర్ణ, ముంగర మల్లికార్జునరావు, గుడివాడ బాలాజీ, బేతపూడి రాజు, పెద్దిరెడ్డి శ్రీనివాస్, ముత్యాల రామచంద్రరావు,గంగినేని వరప్రసాద్, జాన్ బాబు, సుబ్రహ్మణ్యం, ఇందిరా, నాంచారయ్య, బొమ్మనబోయిన స్వాతి, గ్రామ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.