Breaking News

ఏఐఐబి బ్యాంకు సహకారంతో తాగునీరు పైప్ లైన్ల ఏర్పాటు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా కొవ్వూరు పురపాలక సంఘానికి రూ.29.42 కోట్లతో తాగునీరు పైప్ లైన్ల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం కొవ్వూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మంత్రి పైపు లైన్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొవ్వూరు పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత మంజూరు అయిన అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే నన్నారు. ఏఐఐబి బ్యాంకు సహకారంతో జిల్లాలో పాలకొల్లు, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పురపాలక సంఘాలకు గృహ అవసరాలకు సంబంధించి తాగునీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు కొరకు రూ. 116 కోట్లు ఈ బ్యాంకు మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొవ్వూరు మునిసిపాలిటీ లో సుమారు 8 వేల గృహాలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు17.9 కిలోమీటర్లు పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేసి పట్టణ ప్రజలు త్రాగునీరు సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్నామని తానేటి వనిత తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ ఈ రోజు ఎంతో శుభదినమని, కొవ్వూరు అభివృద్ధి కోసం మూడు రంగాల్లోని వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, అదే రోజున పట్టణ త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యల కోసం క్రొత్త ప్రాజెక్టుకు శంఖుస్థాపన జరగడం భగవంతుని సంకల్పం అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మ మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివ రామ కృష్ణ తులసి వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కే టి సుధాకర్ కౌన్సిలర్లు కంట మని రమేష్ బాబు తదితర కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *