కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ కార్యాలయానికి సోమవారం స్పందన కార్యక్రమంలో కేవలం మూడు ఫిర్యాదులు వొచ్చాయని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుంచి ఆర్డీవో స్పందన ఫిర్యాదు లను స్వీకరించారు. ఈ సందర్భంగా డి.లక్ష్మారెడ్డి వివరాలు తెలుపుతూ, భూముల కొలతలు, స్థల పరిహారం పై మారిశెట్టి శ్రీను, గుడాల ఆనందరావు, కె.రూతమ్మా లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన తహసీల్దార్ కు సిఫార్సు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై గ్రామ సచివాలయం స్థాయి లోనే స్వీకరించి పరిష్కరించడం జరుగుతోందన్నారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ, మార్గదర్శకాలు మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరింస్తున్నామన్నారు. గ్రామ/వార్డు వాలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాలకు చెందిన ఏమైనా సమస్యలు ఉంటే స్పందించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని స్పష్టం చేశారు. ఆర్డీవో కార్యాలయం ఏ ఓ, ఇతర అధికారులు స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
