కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
లబ్దిదారుల ఇళ్లు నిర్మాణాలకు స్థానికంగా మేస్తీలు లభించిన లేక ఎక్కువ మొత్తం డిమాడ్ చేస్తున్న తక్కువ రేటుకే ఇల్లు నిర్మించేందుకు ఇతర ప్రాంతాల నుంచి మేస్త్రిలను రప్పించి సమస్యను పరిష్కరిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఎమ్మేల్యో డిఎన్ఆర్ గృహ నిర్మాణ శాఖ డీఈఈ ఆదినారాయణ తో కలసి ఏలూరు రోడ్డు హైవే వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇంటి నిర్మాణాల లబ్ధిదారులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి ఆశీస్సులుతో కైకలూరు పట్టణంలో నేషనల్ హైవే ఏలూరు రోడ్డు ప్రాంతంలో దాదాపు 92 ఎకరాల లే అవుట్ లో 3200 మంది అక్కచెల్లమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ గ్రీన్ విలేజ్ లో మొదటి విడతగా 965 మంది అక్కచెల్లమ్మలకు ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. శంకుస్థాపన చేసిన అక్కచెల్లమ్మలకు తాపీ మేస్త్రీలు దొరకక, ఇంటి నిర్మాణాల కోసం ,ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు లబ్ధిదారులుకు తక్కువ ధరకే ఇంటి నిర్మాణాలు చేస్తామని మేస్త్రిలు ముందుకు వచ్చారన్నారు. కావున లబ్ధిదారులు అక్కచెల్లమ్మలు మొదటి విడతలో కట్టుకోవాల్సిన వారు ముందుకు వచ్చి కట్టుకోవాలని కోరారు. లబ్ధిదారులకు ఇసుక, సిమెంట్, ఐరన్ సకాలంలో అందిస్తే మేస్త్రి లు త్వరగా మీకు ఇంటి నిర్మాణాలు చేసి ఇస్తారని లబ్దిదారులు వివరించారు. ప్రతి లబ్ధిదారులు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగతిన చేపట్టి పూర్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, పంచాయతీ ఈవో లక్ష్మినారాయణ, హోసింగ్ ఏఈఈ మూర్తి, ఆర్ ఐ. ప్రసాద్, నిమ్మల సాయిబాబు,తోట మాధవ , కూనవరపు సతీష్, పండు మేస్త్రి, మదన్,వాలంటరీలు, సచివాలయం ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Tags kaikaluru
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …