Breaking News

కొవ్వూరు పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం… : బావన రత్నకుమారి

-కో ఆప్షన్ సభ్యులచే ప్రమాణ స్వీకారం

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మునిసిపాలిటీ నీ అభివృద్ధి పథం లో నడిపించే విధంగా చర్యలు తీసుకోవడంలో కౌన్సిల్ సభ్యులతో సమన్వయం చేసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ బావన రత్న కుమారి అన్నారు. మంగళవారం కొవ్వూరు మున్సిపా లిటీ సమావేశ మందిరంలో మున్సిపల్ ఛైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా కో ఆప్షన్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ బావన రత్నకుమారి మాట్లాడుతూ కో ఆప్షన్ సభ్యులు గా ఎన్నికైన ఏలూరి వీర వెంకట రావు, షేక్ ఆహమ్మద్ అలీ , కందుకూరి నిరోషా ల కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులు ముగ్గురిని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, కౌన్సిలర్ సభ్యులు అభినందించారు. ఏజెండా లో అంశంగా15వ ఆర్థిక సంఘం నిధులు నుండి పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రధాన అంశంగా తీసుకుంటూ కౌన్సిల్ లో చేర్చించడం జరిగింది. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ షాపుల లీజు పూర్తయినందున నిబంధనల ప్రకారం అద్దె పెంచి తిరిగి వారికే షాపులు ఇచ్చేలా సమావేశం ఆమోదించింది. అజెండాలోని ప్రధాన అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఫలవంతమైన చర్చల అనంతరం అన్ని అంశాలను సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం లీజులో ఉన్న ఆరు మునిసిపల్ కాంప్లెక్స్ భవనముల అద్దె 33.3 శాతం పెంచుతూ తీర్మానం ఆమోదించారు. కొవ్వూరు పట్టణాన్ని పారిశుద్ధ్య పనులు కోసం 3 రకాల డస్ట్ బిన్స్ ఇంటింటి సరఫరా కోసం రూ.29.60 కోట్లు తో కొనుగోలుకు ఆమోదించడం జరిగింది. రాజీవ్ నగర్ లో చెత్త సేకరణ కేంద్రం కోసం రూ.39.50 కోట్ల తో సమావేశ ఆమోదించింది. ప్రచార ఒక శాతం, సంస్థాగత నిర్మాణం కోసం ఒక శాతం నిధులు చొప్పున ఖర్చు చేసేందుకు సమావేశంలో ఆమోదించడం జరిగింది.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *