Breaking News

మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి…

-దేశ, విదేశ పారిశ్రామిక వేత్తలతో మంత్రి సవిత

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం పలువురు దేశ, విదేశ పారిశ్రామిక వేత్తలను కలిశారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో పాటు పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత మండపంలో ప్రధాన నరేంద్ర మోడి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. ఇటీవలే నూతన టెక్స్ టైల్స్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అనువైన ప్రాంతమని, పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు, రాయితీలు ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు మంత్రి ఆహ్వానించారు. ఏపీలో టెక్స్ టైల్స్ రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే మేలైన పట్టు, చేనేత వస్త్రాలు తమ రాష్ట్రంలో ఉత్పత్తవుతున్నాయన్నారు. చేనేత వస్త్రాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పనలో భాగంగా రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో చేనేత ఎగ్జిబిషన్లు, ఎక్స్ పో లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగిస్తూ…వారికి 365 రోజుల పని కల్పించే లక్ష్యంతో టెక్స్ టైల్స్ పార్కులు, వీవర్ శాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూలు కొనుగోలుపై 15 శాతం మేర రాయితీ అందిస్తున్నామన్నారు. ప్రజల్లో చేనేత వస్త్రాల వినియోగంపై పెరుగుతున్న మక్కువను దృష్టిలో పెట్టుకుని ఈ కామర్స్ ద్వారా విక్రయాలు ప్రారంభించామన్నారు. అమెజాన్, మింత్రా, ఫ్లికార్ట్, జియో మార్ట్ వంటి ఏడు ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల్లో 20 ఆప్కో షో రూమ్ ల ద్వారా చేనేత వస్త్రాలను నేరుగా కస్టమర్ల ఇళ్లకే డోర్ డెలివరీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. చేనేత సహకార సంఘాలు చెల్లిస్తున్న జీఎస్టీ రీయింబర్స్ మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల, మర మగ్గాల కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నామన్నారు. నేతన్నలకు 90 శాతం సబ్సిడీతో ఆధునిక పరికరాలు, యంత్రాలు అందజేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత వెంట రాష్ట్ర చేనేత,జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ పర్యటనకు వచ్చిన మంత్రి సవితకు ఏపీ భవన్ లో ఘన స్వాగతం లభించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *