Breaking News

ఇఫ్తార్‌ విందుకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ‌

-ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్ధూలో రంజాన్‌ ముందస్తు శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్ధనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లాహ్‌ చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆయన కోరుకున్నారు.

టోపీ, కండువా ధరించి నమాజ్‌
ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైయస్‌ జగన్‌ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్‌ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్‌ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్ పూర్తి

-గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదు -స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ -ప్రస్తుతం 26 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *