Breaking News

కలక్టర్ ప్రతిపాదించిన 11 అంశాలకి ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం

అమరావతి/ వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యటక అనుబంధ, ఇరిగేషన్, జాతీయ రహదారులు తదితర అంశాలకు చెందిన కలక్టర్ ప్రతిపాదించిన 11 అంశాలకి ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారన్నారు.

శాశ్వత పరిష్కారం దిశగా ఎర్రకాలువ ఆధునీకరణ, తొర్రిగడ్డ పథకం, ఉపాధిహామీ పథకం కింద 200 నుంచి 400 మంది చిన్న , సన్నకార రైతులకి ఉపాధిహామీ పని దినాలు , కడియం నర్సరీలలో కాఫీ గార్డెన్స్ , నరేగా పొడిగింపు, రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న భూమి అప్పగింత విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు పై, కడియం నర్సరీలలో పర్యాటక అభివృద్ధి , భూసేకరణ కి చెందిన రూ.94 98 కోట్ల బకాయిలు విడుదల7, వైట్ ఫీల్డ్ పేపర్ మిల్లు, కొవ్వూరు సి హెచ్ సి నీ 50 నుంచి 150 బెడ్స్ ఆసుపత్రి గా అప్ గ్రేషన్ తదితర 11 ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.

రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రగతి పై , 2025-26 వార్షిక ప్రణాళిక పై సుమారు 24 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి .. కలెక్టర్ ప్రతిపాదించిన పలు అంశాలపై చర్యలు తీసుకోవాలసినదిగా, ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రజెంటేషన్:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా సగటు జిడిపి 59.486 ఉందని, 2025-26 లో 69,206 సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలియచేశారు.

ప్రాథమిక రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో తగిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అధిక దిగుబడులు సాధించేలా, పంట మార్పిడి విధానాలు అమలు పై దృష్టి పెట్టడం జరిగిందనీ తెలిపారు. జిల్లాలో 114 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చెయ్యడం జరుగుతోందని, దానిని 213 గ్రామాలకు విస్తరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించేలా 15 డ్రోన్ ఉపయోగించి, సగటున రోజుకు 22 ఎకరాల్లో పంటలు సాగు అనుబంధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల రైతులకి ఎంతో మేలు చేకూరుతున్నట్లు వివరించారు. జిల్లాలో రానున్న ఆర్థిక సంవత్సరం లో 22 వేల హెక్టార్ల లో ఆయిల్ పామ్ విస్తరణ కొరకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హార్టీకల్చర్ రంగంలో ఉపాధి హామీ కింద 1000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు విస్తీర్ణం పెంచడం, జిల్లాలో 4970 హెక్టార్ల పెంచడం దిశగా అడుగులు వేయడం జరుగుతోంది అని పేర్కొన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పండ్ల తోటలు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా 436 కోట్ల రూపాయలు జీవిఎ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. హార్టికల్చర్ ఉత్పత్తుల ఆవిష్కరణ ద్వారా జివిఏ వృద్ది రేటు 83 కోట్ల రూపాయలు మేర లక్ష్యాలను సాధించనున్నట్లు తెలిపారు. పశు సంపద వృద్ధి రేటును 12 శాతం నుంచి 15 శాతం కు , పచ్చదనం పరిశుభ్రత పై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు, ఆక్వా కల్చర్ రంగం ఉత్పత్తులు పెంచే దిశగా జీవిఏ వృద్ది రేటు దిశగా అడుగులు వేయడం జరుగుతోంది అని పేర్కొన్నారు.

ఖనిజ సంపద వనరుల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఖనిజ ఆదాయాన్ని పెంచడం పై దృష్టి పెట్టడం జరిగిందనీ తెలిపారు. వర్షాకాలంలో సాధారణ ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రభుత్వ పాలసీ విధానంలో అందుబాటు ధరలో ఇసుక అందుబాటులో ఉంచడం పై దృష్టి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. రీచ్ పాయింట్ల వద్ద అదనపు ఇసుక ఛార్జీలు వసూలు చేయడం మరియు సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాహనాల్లో ఇసుకను ఓవర్‌లోడ్ చేయడంపై కాంట్రాక్టర్లను నియంత్రించడం మరియు వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

MSME ద్వారా పారిశ్రామిక వృద్ధి, స్వయం సహాయక సంఘాల ఆర్ధికంగా బలోపేతం చేయడంలో, పీఎం ఉపాధి అవకాశాలు కార్యక్రమం అమలు, మెరుగైన ఉత్పాదకతకు మార్గం సుగమం చేయడానికి స్థిరమైన జీవనోపాధిని అందించడం జరుగుతోందని వెల్లడించారు. సోలార్ రూఫ్ టాప్‌ను అమర్చిన తర్వాత, సంబంధిత గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత/తక్కువ ధర విద్యుత్ లభిస్తుందనీ , రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సూచనల మేరకు, జిల్లాలో 10 వేల గృహాలలో సూర్య ఘర్ పధకం యూనిట్స్ ఏర్పాటు చెయ్యాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.
రైతులపై భారం తగ్గించి, వ్యవసాయ పంపుసెట్లకు నమ్మకమైన సరఫరాను అందించడం ద్వారా ఫీడర్ స్థాయిలో వ్యవసాయ పంపుసెట్ల సోలారైజేషన్‌ను అమలు చేయండం పై దృష్టి పెట్టడం జరిగిందనీ తెలిపారు.

పంచాయతీ రాజ్ – నాబార్డ్ అధ్వర్యంలో రూ.29.24 కోట్ల అంచనాతో 17 పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. గుంతలు లేని రహదారుల అభివృద్ధి పనులు నిమిత్తం రూ.4.62 కోట్ల అంచనాతో 50 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద రెండు జాతీయ రహదారులు పనులను రూ.7 కోట్ల 13 లక్షలతో చేపట్టినట్లు, పురోగతిలో ఉన్న యాన్నారు. రాజానగరం – సామర్ల కోట ఎడిబి రహదారి పనులు మూడు నెలల్లో పూర్తి చేసేందుకు పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

కొవ్వూరు పట్టిసీమ గోదావరీ లెఫ్ట్ కెనాల్ రోడ్డు , బొబ్బర్లంక – ధవళేశ్వం రెండు లైన్ల 22 కిమి రహదారి నిర్మాణం కోసం రూ.48 కోట్ల తో ప్రతిపాదించినట్లు తెలిపారు, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోనీ ఎన్ హెచ్ 365 బీబీ,10 ఆర్ వో బి లు పనులకు సంబంధించి భూసేకరణ పనులు చేపట్టడం జరుగుతున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.

జిల్లాలో 10,784 ఇళ్ళ నిర్మాణం పూర్తి చెయ్యడం కోసం లక్ష్యంగా చేసుకుని ప్రణాళిక అమలు చేయటం జరుగుతున్నట్లు తెలిపారు.. అందులో భాగంగా ఇప్పటికే 4,811 ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని, ఇంకా 5,983 ఇళ్ళ నిర్మాణం చేపట్టవలసి ఉందన్నారు.

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 2 పనులు పురోగతిలో ఉన్నాయని, ఆగష్టు 2025 నాటికి పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

జిల్లాలో పర్యటక రంగం అభివృద్ది కోసం జిల్లా పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆధ్వర్యంలో , వారి దిశా నిర్దేశం లో వేగవంతమైన రీతిలో ముందుకు వెళుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. కడియంనర్సరీలు ప్రమోషన్, అక్టోబరు నెలలో అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్, బ్రిడ్జిలంకలో అడ్వెంచర్స్ స్పోర్ట్స్, అఖండ గోదావరి ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

జిల్లాలో రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు అందించేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేసినట్లు ఆదిశలో వెయ్య స్కేర్ కీ మీ పూర్తి చేశామని, మరో రెండు వేల స్క్వెర్ కిమీ పూర్తీ చేయనున్నట్లు తెలిపారు . 2027-28 నాటికి రెండు టౌన్ షిప్స్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసినట్లు తెలిపారు.

జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 17 కంపెనీస్ రూ.97 లక్షల 18 వేల సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు కంసెంట్ ఇచ్చారన్నారు. జూన్ నాటికి ఆయా పనులు పూర్తి చెయ్యడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షణా భాధ్యత కింద సీ సి కెమెరాల ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 8 వేల సీసీ కెమెరాలు లక్ష్యం గా ఇప్పటికే 4,761 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్ట్ ఐరెన్ ప్లస్ కార్యక్రమం ద్వారా మునగాకు పొడిని సాంఘిక సంక్షేమ, బిసి సంక్షేమ వసతి గృహాలలో ఉన్న బాలికలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. బంగారుకొండ ప్లస్ కింద 33 లక్షల రూపాయలతో బలహీనంగా, రక్త హీనత ఉన్న, వయస్సుకు తగ్గ బరువు, సరైన ఎదుగుదల లేని పిల్లలకి ఆరు నెలలు పాటు పోష్టికాహర కిట్స్ పంపిణి చెయ్యనున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *