విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తైవాన్ లో ఈ నెల 24వ తేదీన నుండి ౩౦వ తేదీ వరకు జరిగిన తైవాన్ ఆర్టిస్టిక్ రోలరు స్కేటింగ్ ఓపెన్ కాపిటిషన్స్ లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పి.చైత్రదీపిక భారత జట్టు కు పలు విభాగాలులో ప్రాతినిత్యం వహించి, పెయిర్ (చైత్రదీపిక మరియు కైవల్య) స్కేటింగ్ విబాగం లో బంగారు పతకం, Inline విబాగం లో కాంస్య పతకం, Couple (చైత్రదీపిక మరియు కైవల్య) డాన్స్ విబాగం లో రజత పతకాలు సాధించి, భారతదేశం తరుపున స్కేటింగ్ లో ఆరు దేశాలకు (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, కొరియా, ఇటలీ, సింగపూర్) దీటైన పోటీ యిచ్చి మూడు పతకాలు సాధించి దేశానికి ఏంతో పేరు తీసుకొంచింది. గత 2023 లో చైనా లో జరిగిన 19th ఆసియన్ రోలరు స్కేటింగ్ ఛాంపియన్షిప్ (వరల్డ్ స్కేటింగ్ అసోసియేషన్) లో కూడా భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించి పెయిర్ స్కేటింగ్ లో బంగారు పతకం సాధించి దేశానికి ఏంతో పేరు తీసుకొంచింది. ఈ ఛాంపియన్షియప్ లో భారతదేశానికి ఎక్కువ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లా కు క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. చైత్రదీపిక ను పలువురు అధికారులు, ప్రజాప్రతినిదులు, క్రీడా అభిమానులు, స్నేహితులు, ప్రవాస ఆంధ్రులు, మరియు కుటుంబసభ్యులు ఆమెను అభినందించారు. టీం ఇండియా రోలరు స్కేటింగ్ కోచ్ పి. సత్యనారాయణ ను ప్రత్యేకంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిదులు, క్రీడా అభిమానులు, స్నేహితులు, ప్రవాస ఆంధ్రులు అభినందించారు.ఇండియా కు ఈ కాంపిటీషన్ లో 25 పతకాలు వచ్చాయి. ఈ సందర్భంగా పి.చైత్రదీపిక గౌరనీయులైన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి తైవాన్ లో స్కేటింగ్ లో సాధించిన పతకాలు గురుంచి వివరించింది.శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు చైత్రదీపిక ను అభినందించి దేశానికి భవిషత్ లో మరిఎన్నో పతకాలు సాధించాలని కోరారు.
