-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం కమిషనర్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్, శ్రీనగర్ కాలనీ, సత్యనారాయణపురం, విద్యాధరపురం, ప్రాంతాలలో మలేరియా సిబ్బంది తో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు బయాలజిస్ట్ సూర్యకుమార్.
అజిత్ సింగ్ నగర్, పి అండ్ టి కాలనీ పరిసర ప్రాంతాల్లో విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ మలేరియా సిబ్బందితో సైడ్ డ్రైన్ లలో నీటి నిలువల వల్ల కాలువలో దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నందున వాటిలో డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేసి, సైడ్ డ్రైన్ లో నీటి ప్రవాహం లో ఎటువంటి ఆటంకం లేకుండా పరిశుభ్రపరిచి, యాంటీ లార్వా ఆపరేషన్ లో భాగంగా దోమలు ఉత్పత్తి చెందకుండా ఎం.ఎల్ ఆయిల్ స్ప్రే చేశారు.
కాలువలో పేరుకుపోయిన గుర్రపుడె క్కలను పరిశుభ్రపరచటమే కాకుండా ఎం.ఎల్ ఆయిల్ స్ప్రే చేసి, కలవపైన దోమలు ఉత్పత్తి కాకుండా చర్యలు తీసుకున్నారు . మరోవైపు మలేరియా సిబ్బంది బోట్ల సహాయంతో గొర్రెపుడెక్కలను తొలగించి, కాల్వ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. ట్రక్సర్ మెషిన్ సహాయంతో త్వరితగతిన గుర్రపుడెక్కలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.