-సమన్యాయం సుపరిపాలతో స్వర్ణాంధ్ర సాకారానికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం -ఎమ్మెల్యే బొండా ఉమ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్ లలో ఆదివారం శ్రీ రామనవమి సందర్బంగా సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వేద పండితుల ఆశీర్వచనాలుతో శ్రీ సీతరాముల వారిని దర్శించుకొని, పూలు, పళ్ళు, పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు, శ్రీమహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జన్మదినోత్సవాన్ని, ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శమైన శ్రీ రాముడు పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని, శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గంలో నవమి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో అభిమానులతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నదని, ఆ శ్రీరాములు వారి అడుగుజాడల్లో నేటి యువత నడవాలని, ధర్మ పరిపాలనకు నిదర్శనమైన ఆ అయోధ్య రాముని ఆశీస్సులతో నియోజకవర్గం, రాష్ట్రం చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నట్టు తెలియజేశారు.
Prajavartha Online Telugu News