విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక రాణి గారి తోట లో విచ్చేసి యున్న శ్రీ కోదండ రామాలయంలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి హాజరైన పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ రాణి గారి తోట శ్రీ కోదండ రామాలయానికి కోగంటి సత్యం కుటుంబానికి ఎంతో అనుబంధం. శ్రీ కోదండ రామ ఆలయ నిర్మాణం జరిగినప్పుడు ఈ దేవాలయానికి భారీ విరాళం అందించిన వారిలో కోగంటి సత్యం కుటుంబం అగ్రస్థానం. అందుకే దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలలో ఎప్పుడు కోగంటి సత్యనారాయణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ప్రస్తుత దేవాలయం అధ్యక్షురాలు రాయ రంగమ్మ రామాలయంలో గుడి పైకి ఒకే మెట్ల దారి వలన ఎక్కి దిగుటకు భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇది గమనించిన కమిటీ సభ్యులు నిన్న శ్రీరామనవమి సందర్భంగా తాత్కాలిక మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఇది శాశ్వత మెట్ల మార్గంగా ఏర్పాటు చేయాలని రామాలయం గుడి కమిటీ సభ్యులు కోగంటి సత్యం కి కోరగా నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని కోగంటి సత్యనారాయణ హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News