-శ్రీరామనవమి సందర్భంగా సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించిన పోలీస్ కమీషనర్ దంపతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ బందర్ రోడ్ నందు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంనకు సంప్రదాయం ప్రకారం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. సతీసమేతంగా విచ్చేయగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికినారు. అనంతరం పోలీస్ కమీషనర్ దంపతులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో స్వామి వార్లకు పట్టువస్త్రాలను సమర్పించి, అనంతరం సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులకు వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ దంపతులు అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్., ఎ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్, ఎస్.వి.డి. ప్రసాద్, ఏ.డి.సి.పి.లు. జి. రామకృష్ణ, ఎ. వి. ఎల్ ప్రసన్న కుమార్, కె. కోటేశ్వరరావు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ కమీషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ రామాలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోషియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News