విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని పలు మండలాల్లో బిజెపి పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఎన్టీఆర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం కార్యకర్తలకు అభిమానులకు స్వీట్స్ పంచారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి పార్టీ దేశంలోనే అత్యున్నతమైన బలమైన పార్టీగా ఆవిర్భవించిందని కొనియాడారు.
విజయవాడ బిజెపి పార్టీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ మరియు బిజెపి పార్టీ కీలక నేత డాక్టర్ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో మండలాల్లోని పలు ప్రాంతాల్లో సొంత నిధులతో బిజెపి పార్టీ దిమ్మలను కట్టించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అనంతరం పేదవారికి దుస్తులు మరియు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అయ్యప్ప నగర్ లో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి నాయకులు యార్లగడ్డ సందీప్ ఆధ్వర్యంలో డాక్టర్ కాకాని తరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం డివిజన్లోని నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ పంపిణీ చేశారు బీజేపీ నాయకులు కాకాని తరుణ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే బలమైన పార్టీగా ఆవిర్భవించిన బిజెపి పార్టీని మరింత శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దడంలో మోడీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మరియు శ్రీరామనవమి పండగ పర్వదినం రోజున బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల్లోని అధ్యక్షులు డివిజన్ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అమ్మ ఫంక్షన్ హాల్ జంక్షన్‌లో…
బిజెపి 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గుణదల మండలం అమ్మ ఫంక్షన్ హాల్ జంక్షన్‌లో కొత్తగా నిర్మించిన బిజెపి దిమ్మ మరియు బిజెపి జెండాను ముఖ్య అతిథి బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ అడ్డూరి ఆవిష్కరించారు. ఈ నిర్మాణాన్ని భారతీయ జనతా పార్టీ సంస్థాగత దివాస్ ఇన్‌ఛార్జ్ విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జ్ డాక్టర్ తరుణ్ కాకాని నిర్మించారు. తరువాత అక్కడ ఉన్న కార్మికులకు మజ్జిగతో పాటు తువ్వాలను, పండ్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సీనియర్ బిజెపి నాయకులు కోలపల్లి గణేష్, అవ్వారు బుల్లబ్బాయి, పైలా సురేష్, మండల అధ్యక్షులు ఎన్ పవన్ మరియు ఇతరుల సమక్షంలో భారీ స్థాయిలో జరిగింది.
Prajavartha Online Telugu News