-ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
-ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగుబలహీన వర్గాల ప్రజలకు విద్యా, వైద్యం, ఇతర మౌళిక వసతులకు చేయూతగా వుండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన పీ4 కార్యక్రమం ఒక విప్లవాత్మకమైన మార్పు. సమాజంలోని ఆర్ధిక అసమానతలను తొలగిస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ భవనం ఎన్టీఆర్ భవన్ లో సోమవారం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమికి భారీ మోజార్టీ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఎస్సీ నియోజకవర్గమైన నందిగామలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదిక, పీ4 కార్యక్రమం నిర్వహించారని, డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ నినాదమైన పే బ్యాక్ సోసైటీ స్పూర్తితోనే పీ4 కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు. పీ4 కార్యక్రమం పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిదన్నారు. పార్టీలకు అతీతంగా పేదలందరికీ పీ4 చేయూతగా నిలుస్తుందని చెప్పారు.
అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ ప్రణాళిక సిద్దం చేసిందన్నారు. ఈ నెల 11 నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుందని ఈ అవకాశాన్ని వినియోగించుకుని రుణాలు అందరూ పొందాలన్నారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని తన ఆఫీస్ నుంచి అందిస్తానని తెలిపారు.
సభ్యాధక్షత వహించిన ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లల్లో ఎస్సీ వాడలకు దూరంగా వున్న అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరగనుందన్నారు. ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) జిల్లాలో 40 గ్రామాలను దత్తత తీసుకున్నారని, జిల్లాలోని 295 గ్రామాలను వికసిత్ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కేశినేని ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తాటి రామారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మందా మురళీ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వహక కార్యదర్శి బూరుగునారాయణ, జగ్గయ్యపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మారకపూడి వరకుమార్, మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్, తిరువూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోడుగు వెంటేశ్వరరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవరపల్లి ఆంజనేయులు, సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నందేటి ప్రేమ్ కుమార్ లతో పాటు జిల్లా ఎస్సీ సెల్ కమిటీ నాయకులు, నియోజకవర్గ, మండల, గ్రామ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.