-ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్ అర్హులు లబ్ధిదారులకు అందజేస్తున్నాము
-శ్రీ సత్యసాయి జిల్లా ఉద్యానవన పంటలలో మంచి ఫలితాలు సాధిస్తున్నది
-రాష్ట్ర ఎక్సైజ్, గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర
-గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా బీసీ సంక్షేమానికి 48 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాం.
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ
పాలసముద్రం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన మధ్య విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాము. రాష్ట్ర ఎక్సైజ్, గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం పెనుగొండ డివిజన్ పరిధిలోని గోరంట్ల మండలంలో పాలసముద్రము నందు నూతనంగా 1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐ ఎం ఎఫ్ ఎల్ డిపో గోడౌన్ రెండును మంత్రివర్యులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలోరాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర రెవెన్యూ మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ
ప్రజల ఆరోగ్యానికి పెద్దపేట వేస్తూ, నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 డిపోలు ఉన్నాయని ,నేడు 1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐ ఎం ఎఫ్ ఎల్ డిపో 30వ గోడౌన్ ను సాంకేతికతను జోడించి అత్యంత ఆధునికంగా నిర్మించడం జరిగిందన్నారు.రాష్ట్రంలోత్యంత పారదర్శకంగా 3500 మద్యం దుకాణాల కేటాయింపు చేపట్టామని, గోదాము నుంచి వెళ్లే ప్రతి స్టాకు వాహనాన్నిట్రాక్చేస్తున్నామన్నారు.వాహనం గోదాం నుంచి దుకాణం వద్దకు వెళ్లే వరకు పర్యవేక్షణ పెట్టే వ్యవస్థ తెచ్చామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని అరికట్టడం ద్వారా రాష్ట్రంలో30 నుండి 40 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు.మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను అమలు చేస్తున్నామన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నదని
ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 రూపాయలపింఛన్ఇస్తున్నదని,సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలు, ప్రతి నెల 64లక్షలపింఛన్లుఇస్తున్నామన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను అర్హత కలిగిన ప్రతి ఇంటికి అందజేస్తున్నామన్నారు.పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం కోసం P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారన్నారు.కూటమి అధికారంలోకి రాగానే ఎక్సైజ్ వ్యవస్త మొత్తాన్ని ప్రక్షాళన చేశాం.జగన్ పాలనలో కల్తీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తే ప్రస్తుతం నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాం. గతంలో ఆల్కహాల్ మాత్రమే పరీక్షించారు. కానీ నేడు 13 రకాల పరీక్షలు చేసిన తరవాతే షాపులకు తరలిస్తున్నాం. అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉండేలా కూటమి చర్యలు తీసుకున్నది. ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో ప్రతి బాటిల్ ను ట్రాక్ చేస్తూ అవినీతికి తావు లేకుండా చేస్తున్నాం.
తక్కువ ధరలో మద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.జగన్ పాలనలో 99 వేల కోట్ల క్యాష్ అండ్ క్యారీ విధానంలో అమ్మకాలు చేశారు.కూటమి పాలనలో అన్ని షాపుల్లో డిజిటల్ పేమెంట్ అందుబాటులో ఉంచాం.
– నవోదయం 2.0 ద్వారా నాటు సారా నిర్మూలనకు శ్రీకారం చుట్టాం. కియాతో ఉమ్మడి అనంతపురం జిల్లా రూపురేఖల్ని నారా చంద్రబాబు మార్చారు.ఉమ్మడి అనంతపురం జిల్లా హార్టికల్చర్ మంచి ఫలితాలు సాధించుచున్నదని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో శ్రీ సత్య సాయి జిల్లా తలసరి ఆదాయంలో కోస్తా జిల్లాలతో పోటీ పడుతున్నదని తెలిపారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నాణ్యమైన మందులేకుండా సరఫరా చేయడం జరిగిందని దాన్ని తాగి కొందరు మతిస్థిమితి కోల్పోవడం జరిగిందని తెలిపారు. దాచుకోవడం దోచుకోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 99 రూపాయలు నుంచి నాణ్యమైన మందు సరఫరా చేయుచున్నదని తెలిపారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒక కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో రెండు గో గోడెంలో నిర్మించడం జరిగిందని శ్రీ సత్య సాయి జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు అన్ని మద్యం షాపులకు ఇక్కడి నుంచి మద్యం సరఫరా జరగడం తెలిపారు. ఈ గోడంలు నిర్మించడం వల్ల సుమారు వందమందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది 60 నుండి 70 వరకు మద్యం సరఫరా సంబంధించిన వాహనాల యజమానులకు ఉపాధి లభిస్తుంది తెలిపారు.గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా బీసీ సంక్షేమానికి 48 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ అనసూయ దేవి, ఎక్సైజ్ డిసి నాగ మద్దయ్య, ఆర్డీవో సువర్ణ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News