విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంచి ఆహార ఆలవాట్లతో పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యత పై రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యం మరియు మనుగడను పెంపొందించడంతో పాటు ప్రసూతి, శిశు మరణాల పై అవగాహన కల్పించేలా జిల్లాలో మాతా శిశు సంరక్షణ, సంక్షేమ సేవలు బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా గర్భదారణ, ప్రసవ సమయబీపంలో మహిళలు, పుట్టిన నెల లోపే శిశువులు మరణించం దురదృష్టకరమన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా నవజాత శిశువుల మరణాలను తగ్గించే లక్ష్యాలకు చేరువ కావాలన్నారు. జిల్లా లోని గ్రామీణ, పట్టణ ప్రాంత పరిధిలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో మాతా శిశు సంరక్షణ ,ఆరోగ్యం పెంపొందించేందుకు తీసుకోవలసిన చర్యలతో పాటు మాతా శిశు మరణాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
అవగాహన పోస్టర్ కార్యక్రమంలో డిఆర్‌వో ఎం లక్ష్మీ నరసింహాం, డిఆర్‌డిఏ పిడి నాంచారయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.యం.సుహసిని, డిప్యూటి డియంఅండ్ హెచ్‌వో డా. ఉషారాణి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారిణి జి. జ్వోతి తదితరులు పాల్గొన్నారు.