Breaking News

HMIS మరియు RCH కార్యక్రమాలు పై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ

మాతా శిశు సంరక్షణ సమగ్ర సేవల వివరాల నమోదు కై రూపొందించబడిన HMIS మరియు RCH కార్యక్రమాలు పై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త
మాతా శిశు సంరక్షణ సేవల వివరాలను సమగ్రంగా సేకరించుటలో దోహద పడుతున్న HMIS & RCH కార్యక్రమాలలో చోటుచేసుకున్న పలు మార్పులు చేర్పులకు సంబంధించిన రిపోర్టింగ్ ఫార్మట్స్ పై రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం హోటల్ హైలాండ్, చిన్న కాకాని లో జిల్లా స్థాయి అధికారులకు ( DIO , DPMO , SO , DYSO, DPO, MIS లకు) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము లో Dr . K .V. N .S అనిల్ కుమార్, రాష్ట్ర అదనపు డైరెక్టర్ (RMNCH) కుటుంబ సంక్షేమ శాఖ వారు అతిధి గా పాల్గొన్నారు.
Dr . K .V. N .S అనిల్ కుమార్, రాష్ట్ర అదనపు డైరెక్టర్ కుటుంబ సంక్షేమ శాఖ వారు మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ వివరాల సేకరణలో తగు జాగ్రత్తలు తీసుకొని ఏ ఒక్క సమాచారం కూడా మిస్ కాకుండా నమోదు చేసేందుకు పటిష్టమైన reporting system ని ఏర్పాట్లు చేసుకోవాలి అని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు. అదేవిధంగా మాతా శిశు సంరక్షణ వివరాల సేకరణ లో నాణ్యత ప్రమాణాలు పాటించుట ద్వారా సమగ్రమైనటువంటి గణాంక వివరాలు సేకరించవచ్చు తద్వారా ఆయా రంగాలకు మెరుగైన సదుపాయాలు రూపకల్పనలో ఆ గణాంకాలు సహాయపడుతాయని తెలియచేసారు. అదేవిధంగా జిల్లా స్థాయి లో ఎప్పటికప్పుడు ఈ సమాచార సేకరణకు సంబంధించిన పలు అంశాలు పై పూర్తి స్థాయి సమీక్షలు చేసుకొనుట ద్వారా లోపాలను నివారించుకొనుటయే కాకా నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి సమాచారాన్ని రూపొందించుకోవచ్చని తెలియచేసారు
సదరు శిక్షణ శిబిరం లో ట్రైనర్ గా వ్యవహరించిన కే.శివశంకర బాబు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ గణాంక విభాగపు డిప్యూటీ డైరెక్టర్ (డెమో గ్రఫీ ) వారు HMIS &RCH పోర్టల్ లో గల గర్భవతులు & హై రిస్క్ ప్రగ్నెన్సీ వివరాల సేకరణ, జననాలు నిర్జీవ జననాలు, abortion కేర్ , రాష్ట్రీయ బాల స్వాస్థ్య, అనీమియా ముక్త భరత్, ప్రసవంతరా సేవలు లైంగిక పర వ్యాధులు కుటుంబ సంక్షేమం వ్యాధి నిరోధక టీకాలు, చిన్న పిల్లల వ్యాధులు, మలేరియా ఆడలిసెంట్ హెల్త్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మోర్టాలిటీ డీటెయిల్స్, క్వాలిటీ కంట్రోల్ వంటి ముఖ్య సమాచార సేకరణ కార్యక్రమాన్ని సంవర్ధవంతంగా నిర్వహించటలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను HMIS &RCH డేటా ను మరింత సమర్ధవంతంగా నిర్వహించుటలో జిల్లా స్థాయి అధికారులకు ( DIO , DPMO , SO , DYSO, DPO, MIS లకు) పునఃసమీక్షా మరియు శిక్షణ ఇవ్వడమైనది.
అధేవిధంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్బంగా Healthy Beginnings-Hopeful Futures (అరోగ్య క‌రమైన ప్రారంభాలు —– ఆశాజ‌న‌క భవిష్యత్తులు ) అనే నినాదంతో ప్రగతిపదాన నడిచేందుకు మాత శిశు సంరక్షణ సేవలు అభివృద్ధి లక్ష్యంగా ” ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు – ఏ బిడ్డ జన్మిస్తూ మరణించకూడదు “అన్న పదాన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి చేయవలసిందిగా పిలుపునివ్వడమైనది
ఈ కార్యక్రమం లో RCH ప్రోగ్రాం విభాగపు అధికారులు ఢిల్లీ వారు, మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో వివిధ విభాగాల అధికారులు మాత శిశు ఆరోగ్య విభాగానికి సంబంధించిన రాష్త్ర స్థాయి అధికారులు ఐనటువంటి జాయింట్ డైరెక్టర్స్ , ప్రోగ్రాం ఆఫీసర్స్ , రాష్ట్ర స్థాయి డెమోగ్రఫీ సిబ్బంది మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపినందుకు MLA బొండా ఉమాకి ధన్యవాదాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతోకాలంగా పరిష్కారం కాని తమ ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపినందుకు మహిళలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *