అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రిటన్ హైకమీషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ పధకాలు ప్రాజెకుల వివరాలను సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ హైకమీషనర్ కు వివరించారు.అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అనువైన రంగాలు,ప్రాంతాల వివరాలను కూడా తెలియజేస్తూ ఆయన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చేలా తగిన కృషి చేయాలని బ్రిటిష్ హైకమీషనర్ ఆండ్రూ ప్లెమింగ్ ను కోరారు.హైకమీషనర్ మాట్లాడుతూ ఆరోగ్యం,ఇంధనం,విద్యుత్ వాహనాలు,వ్యవసాయ టెక్నాలజీ,వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ కు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్టు సిఎస్ కు వివరించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను దుశ్శాలు,జ్ణాపికతో సత్కరించారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి,యుకె డెలిగేషన్ ప్రతినిధులు బ్రిటీష్ ట్రేడ్,ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు సర్వం సిద్ధం…
-నేటి (శుక్రవారం) నుండి మూడు రోజులపాటు కళాభిమానులకు కనువిందు… -పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధం…. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ …