Breaking News

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నాడు–నేడుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ…

గ్రామం యూనిట్‌గా వ్యాక్సినేషన్‌
ఉపాధ్యాయులు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి: అధికారులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం
గ్రామాల యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి: సీఎం
దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్‌ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది:
వ్యాక్సిన్లు వృథాకాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చన్న సీఎం
18–44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలన్న సీఎం
ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చేదిశగా ఆలోచనలు చేయాలన్న సీఎం

ఏపీ డిజిటల్‌ హెల్త్‌పై సీఎం సమీక్ష
ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటాను నిక్షిప్తం చేయాలన్న సీఎం
క్యూఆర్‌కోడ్‌ రూపంలో ఈ వివరాలు తెలుసుకునేలా ఉండాలన్న సీఎం
విలేజ్‌క్లినిక్స్‌లో కూడా డేటా నమోదు ఉండాలన్న సీఎం
ప్రతి విలేజ్‌, వార్డు క్లినిక్స్‌లో కూడా కంప్యూటర్‌ ఉంచాలన్న సీఎం
ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్న తేదీ, సమయం కూడా క్యూఆర్‌కోడ్‌ ద్వారా నిక్షిప్తం కావాలన్న సీఎం
బ్లడ్‌గ్రూప్‌ల వివరాలు కూడా ఉండాలన్న సీఎం
104 గ్రామాలకు వెళ్లేసరికి, ఒక వ్యక్తి ఆరోగ్య వివరాలు డాక్టర్‌కు సులభంగా తెలిసేలా ఈ విధానం ఉండాలన్న సీఎం
దీనివల్ల చికిత్స చాలా సులభతరమవుతుందని, వైద్యం త్వరగా అందుతుందని తెలిపిన సీఎం
షుగర్, బీపీ, బ్లడ్‌గ్రూపు సహా ఇతర వివరాలను కార్డులో నిక్షిప్తం చేయాలన్న సీఎం
టెస్టులు చేసిన తేదీ, వివరాలు నమోదు సమయం తదితర వివరాలన్నీకూడా ఇందులో ఉండాలన్న సీఎం
విలేజ్‌ క్లినిక్స్‌లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి ఉండాలన్న సీఎం
ఆ మేరకు విలేజ్ క్లినిక్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: సీఎం
విలేజ్‌ క్లినిక్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి… ఆరోగ్యశ్రీ కింద ఎంపానెల్‌ అయిన ఆస్పత్రుల వివరాలు అందుబాటులో ఉంచాలన్న సీఎం
చికిత్స కోసం రోగులను నేరుగా సంబంధిత ఆస్పత్రిలో జాయిన్‌చేయడం, వారితో సమన్వయం చేసుకోవడం లాంటి బాధ్యతలను సిబ్బంది నెరవేర్చేలా విధానం ఉండాలన్న సీఎం
భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుమీద ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేయాలన్న సీఎం
కుటుంబ సభ్యుడి కార్డు క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ కాగానే ఆ వ్యక్తితోపాటు, కుటుంబ సభ్యుల ఆరోగ్యవివరాలు వెంటనే లభ్యమయ్యేలా చూడాలన్న సీఎం
వీటిని ఆధార్‌కార్డు నంబర్‌తో లింక్‌చేసేలా చూడాలన్న సీఎం
ఆరోగ్యశ్రీ కార్డు నంబర్‌చెప్పినా, లేదా ఆధార్‌ కార్డు నంబర్‌ చెప్పిన వెంటనే సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలు లభ్యమయ్యే విధానాన్ని తీసుకురావాలన్న సీఎం

ఈ విధానాలన్నీ సమర్థవంతంగా అమలు చేయడంలో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని, అవి పూర్తయ్యేలా అధికారులు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

పిల్లల వ్యాక్సిన్లుపైనా ప్రత్యేక దృష్టి
పిల్లలు అన్నిరకాల వ్యాక్సిన్లు తీసుకుంటున్నారా? లేదా?అన్న వివరాలు కూడా ఆరోగ్యశ్రీ కార్డుల్లో నమోదు చేయాలన్న సీఎం
దీనివల్ల వ్యాక్సిన్లపై ఫాలో అప్‌ చేయడానికి అవకాశాలు ఉంటాయన్న సీఎం
తల్లులు, పిల్లల ఆరోగ్యంపై విలేజ్‌క్లినిక్స్‌ అత్యంత దృష్టిపెడతాయన్న సీఎం

గ్రామాల్లో కాలుష్యంపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
గ్రామాల్లోని నీరు, గాలి, మట్టి నమూనాలను పరిశీలించి కాలుష్య స్థాయిలపై తగిన వివరాలు తీసుకోవాలన్న సీఎం
శానిటేషన్‌ పరిస్థితులపైకూడా వివరాలు నమోదుకావాలన్న సీఎం
దీనివల్ల వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం
అలాగే గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్న సీఎం
పీరియాడికల్‌గా వీటిని శుభ్రం చేసేలా చూడాలన్న సీఎం
విలేజ్‌క్లినిక్స్‌ద్వారా ఈ అంశాలపై దృష్టిపెట్టినప్పుడు ప్రజల ఆరోగ్యం బాగుండేలా తగిన చర్యలను తీసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం
ఈ ప్రోటోకాల్స్‌ను పటిష్టంగా రూపొందించాలన్న సీఎం

జిల్లా యూనిట్‌గా నియామకాలు
విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రులు వరకూ ఉండాల్సిన సిబ్బంది ఎంత మంది ఉన్నారు, ఎంతమంది కావాలి అన్నదానిపై డేటాను తయారుచేయాలి : అధికారులకు సీఎం ఆదేశం
అవసరమైన సంఖ్యలో వైద్యులను నియమించాలన్న సీఎం
జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిక్రూట్‌మెంట్‌ చేయాలన్న సీఎం
మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికావాలి: అధికారులుకు సీఎం ఆదేశం
మూడునెలల్లో సిబ్బంది కొరత అనేది లేదన్న మాట నాకు చెప్పగలగాలన్న సీఎం

పెట్టుకున్న సిబ్బంది ప్రజలకు మెరుగ్గా సేవలను అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
జాతీయ స్ధాయి ప్రమాణాలతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందాలన్న సీఎం

గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయన్న దానిపై పర్యవేక్షణ చేయాలన్న ముఖ్యమంత్రి
ఇలాంటి చోట్ల సేవలు అందించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలపై ఆలోచన చేయాలన్న సీఎం
జీఎంపీ ప్రమాణాలున్న మందులు రోగులకు అందించాలన్న సీఎం

పీహెచ్‌సీ నుంచి పైస్థాయి ఆస్పత్రుల వరకూ కూడా కాంపౌండ్‌వాల్‌ ఉండాలని స్పష్టంచేసిన సీఎం
దీనికోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం

కోవిడ్‌– వ్యాక్సినేషన్‌–శాస్త్రీయ విశ్లేషణ
వ్యాక్సిన్లు, అనంతర పరిస్థితులపై శాస్త్రీయంగా విశ్లేషణ చేయాలన్న సీఎం
వ్యాక్సిన్లు వేసుకున్నవారిపై వైరస్ ‌ప్రభావం, వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా వైరస్‌ సోకిన తీరు తదితర అంశాలపై శాస్త్రీయ విశ్లేషణ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
ఇతర రాష్ట్రాల్లోకూడా పరిస్థితులను అధ్యయనం చేయాలన్న సీఎం
దీనివల్ల రాష్ట్రంలో కోవిడ్‌ నివారణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం

కోవిడ్‌ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై సీఎంకు వివరాలందించిన అధికారులు

గణనీయంగా తగ్గుతున్న పాజిటివ్‌ కేసులు
యాక్టివ్‌ కేసులు సంఖ్య 18,882
రికవరీ రేటు 98.37 శాతం
పాజిటివిటీ రేటు 2.29 శాతం
3 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 10
3 నుంచి 5 శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 2
5 కంటే ఎక్కువ పాజిటివిటీరేటు ఒక్క జిల్లాలో నమోదు
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 93.39 శాతం
ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 73.08 శాతం
16 దఫాలుగా ఇంటింటికీ కోవిడ్‌ సర్వే పూర్తి

థర్డ్‌ వేవ్‌ సన్నద్దత
థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నామన్న అధికారులు
సరిపడా మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నామన్న అధికారులు
అందుబాటులో ఉన్న డీ–టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లు 27,311,
ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు 20,464
సెప్టెంబరు 10 నాటికి 50 పడకలు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైప్‌లైన్స్‌ ఏర్పాటు
140 చోట్ల ఏర్పాటు కానున్న ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు (పీఎస్‌ఏ)
ఆగష్టు నెలాఖరునాటికి పూర్తి కానున్న 104 పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు
సెప్టెంబరు 15 లోగా మిగిలిన 36 పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తవుతుందన్న అధికారులు

ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *