విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని శేషసాయి కళాణ్యమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గుబ్బాచంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి, శాసనసభ్యులు మల్లాది విష్ణు, అంబటి రాంబాబు, మద్దల గిరి, ఎమ్మెల్సీ డొక్కా మణిక్య వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణతో ముడిపడి వుందని అందుకే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకాన్ని, అటవీ అభివృద్ధికి చర్యలు చేపట్టిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజమెంట్ కార్పొరేషన్ నూతనంగా ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికి సమన్యాయం జరిగేలా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా సమర్థత గల పార్టీ కార్యకర్తలను నియమించారన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర మంత్రుల నుండి కార్యకర్తల వరకు పనిచేయవలసిన అవసరం వుందని మంత్రి అన్నారు. నూతనంగా చైర్మన్‌గా పదవీ భాద్యతలు స్వీకరించిన గుబ్బా చంద్రశేఖర్ ఈ కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపించగలరనే నమ్మకం నాకు వుందని ఈ సందర్భంగా నూతన చైర్మనక్కు అభినందనలను తెలియజేస్తున్నానని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గుబ్బా చంద్రశేఖర్ మాట్లాడుతూ మానవళి మనుగడకు పర్యావరణ పరిరక్షణే ఆధారమని, ప్రతి ఒక్కరూ పర్యావరణనికి చేటు చేయనని, పర్యావరణాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నమని చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్ లో దేశంలోనే మొట్టమొదటిగా అలైన్ వేస్ట్ ఎక్సెచేజ్ ఫ్లాట్ ఫాంగా అభివృద్ధి చేయలనే ఆలోచన ఉన్నదన్నారు. విషపూరిత వ్యర్ధాలను నూరు శాతం సేఫ్ డిస్పోజల్ చేయుటే లక్ష్యంగా ఈ కార్పొరేషన్ పనిచేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ,విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి. గౌతమ్ రెడ్డి, శాసనసభ్యులు మల్లాది విష్ణు, అంబటి రాంబాబు, మద్దల గిరి, ఎమ్మెల్సీ డొక్కా మణిక్య వర ప్రసాద్, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు, విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాకా నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …