పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదు… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరికం ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డు కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా పాలసీకి శ్రీకారం చుట్టిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, విద్యార్దినులకు జగనన్న విద్యా కానుకగా పాఠ్య పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, 3 జతల యూనిఫారం, డిక్షనరీ, షూస్, బ్యాగ్ , తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఎ మ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిని ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన చేపట్టారన్నారు. విద్యా రంగానికి 24 వేల 624 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రతీ పేద విద్యార్ధినీ, విద్యార్ధులకు కార్పోరేట్ విద్యను రూపాయి ఖర్చు లేకుండా అందించేందుకు నూతన విద్యా పాలసీని తీసుకువచ్చారన్నారు. పేద విద్యార్థులలో ఆత్మనూన్యతను పోగొట్టి, ఆత్మ సైర్యం పెంపొందించేలా ఉన్నత విద్యా అవకాశాలను జగనన్న విద్యాకానుక, ఫీజు రియంబర్స్ మెంట్, జగనన్న వసతి కానుక ద్వారా అందిస్తున్నామన్నారు. పాఠశాల స్థాయి నుండే పిల్లలను అమ్మఒడి బడికి తీసుకువస్తున్నామని, మన విద్యార్ధులకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంగ్లీషు మీడియంను పాఠశాల స్థాయి నుండి ప్రవేశ పెట్టామన్నారు. చిన్నతనం నుండి పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించేందుకు జగనన్న గోరుముద్ద పధకం ద్వారా నాణ్యమైన మెనూతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా ఉపాధి అవకాశాలు అథిక డిమాండ్ ఉన్న కోర్సులలో విద్యార్ధులకు నైపుణ్యాన్ని పెంచే కోర్సులను ప్రవేశ పెడుతున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు అనువైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ” మన బడి – నాడు-నేడు ” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి కార్పోరేట్ స్థాయిలో తీర్చుదిద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థినులకు శాసనసభ్యులు అందించారు. అనంతరం ” మన బడి – నాడు-నేడు ” కార్యక్రమం కింద నిర్మించిన అదనపు తరగతి గదులను శాసనసభ్యులు ప్రారంభించారు. అనంతరం 10వ తరగతిలో 10 పాయింట్లు సాధించిన విద్యార్థినులకు మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావును పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామశెట్టి త్రివేణిదుర్గ, వైస్ ఛైర్మన్ పగడాలసత్యనారాయణ, కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, ఎంపిడివో జి.రాణి, కౌన్సిలర్ శీలం రాము, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆదిలక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *