అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సులభతర వాణిజ్యం(Ease of Doing Business)అంశంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన అధ్యక్షతన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్(MRCB) అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సులభతర వాణిజ్యం విషయంలో దేశంలో మన రాష్ట్రానికున్న అగ్రస్థానాన్ని అదే స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.కావున సులభతర వాణిజ్యం విషయంలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని పునరుద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ను వాస్తవికంగా ఆచరణలో పెట్టే ప్రక్రియలో భాగంగా రాబోవు జనరేషన్ కు తగ్గట్టుగా ప్రజలకు వివిధ సేవలను అందించే విషయంలో మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.దానిలో భాగంగా వివిధ సేవలన్నీ ఆన్లైన్ లో పారదర్శకంగా నిర్ధిష్ట కాలవ్యవధిలో అందేలా చర్యలు తీసుకోనుందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల వారీగా అందించే వ్యాపార వాణిజ్య సేవలను వినియోగదారులకు సకాలంలో ఒక నిర్ధిష్ట సమయం ప్రకారం అందే విధమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయా శాఖలవారీగా ఏఏ కార్యక్రమాలు చేపడుతుంది వినియోగదారులకు పూర్తిగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.అలాగే ఈవిషయంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖలు నోడలు అధికారులను నియమించుకుని తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు నోడలు అధికారుల వివరాలను అందు బాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు సంబంధిత అసోసియేషన్లతో మాట్లాడి వారు అడిగే సందేహాలను నివృత్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు. అదే విదంగా జిల్లా కలక్టర్లు కూడా కనీసం 1శాతం వినియోగ దారులతో స్వయంగా మాట్లాడాలి వారడిగే సమస్యలను నివృత్తి చేయాలని ఆదేశించారు.సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు జిల్లా కలక్టర్లతో మాట్లాడాలి ఈవిషయంలో క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు ఉండేలా చూడాలని చెప్పారు.ఈనెలా ఆఖరి వారంలో ప్రధానమంత్రి సమీక్ష లోగా ఈఅంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా శాఖల నుండి సేకరించి అప్ డేట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరకల వల్లవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు దశల్లో 390 బర్డెన్ సమ్ కంప్లయెన్స్ లను గుర్తించి వాటిని 285కు తగ్గించామని తెలిపారు.
పరిశ్రమలశాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం అజెండా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ స్టేట్ రిఫార్మ్స్ కార్యాచరణ ప్రణాళిక-2020 కింద ప్రతి సేవకు సంబంధించి కనీసం 20మంది వినియోగ దారులు స్పందించాల్సి ఉందని తెలిపారు.రెగ్యులేటర్ కంప్లయెన్స్ కు సంబంధించిన పూర్తి డేటా బేస్ అందుబాటులో వివరించారు.మొత్తం 285 బర్డెన్ సమ్ కంప్లయెన్స్ లకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన 36 చట్టాల్లో మార్పులు చేర్పులు లేదా రద్దు వంటి అంశాలపై గుర్తించామని వాటిని వచ్చే అసెంబ్లీ సమావేశాల ముందుకు తీసుకు రావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్ చంద్ర,పూనం మాల కొండయ్య, ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు,ఎఆర్ అనురాధ,శశిభుషణ్ కుమార్,శ్యామల రావు, పిసిసిఎఫ్ ప్రదీప్, ఇఓ కార్యదర్శి ఐఅండ్పిఆర్ టి.విజయకుమార్ రెడ్డి,బాబు ఎ,రేఖారాణి,ఇంకా పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.