విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ శాఖ ఆద్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే 65వ వ్యవస్థాపక దినోత్సవం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మనికొండ వెంకట చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించగా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ యూనియన్ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎం వి చలపతిరావు యూనియన్ కు చేసిన సేవలను కొనియాడారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ యూనియన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు కె జయరాజ్, కౌన్సిల్ మెంబర్లు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు, యూనియన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, స్సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఎంవీ సుబ్బారావు యూనియన్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు దాసరి నాగరాజు, టి. శివరామకృష్ణ, ఏ సురేష్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం…
ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భవానీపురంలోని సాయి సేవా వృద్ధాశ్రమంలో 30 మంది వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు. వృద్ధులకు స్వయంగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, విజయవాడ అర్బన్ అధ్యక్షులు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు కె జయరాజ్, దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, ఎస్కే బాబు, స్సామ్నా ప్రతినిధులు సీహెచ్ రమణారెడ్డి, ఎంవీ సుబ్బారావు, దాసరి నాగరాజు తదితరులు భోజనాలు వడ్డించిన వారిలో ఉన్నారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి…
మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే విష్ణులకు వినతి పత్రం సమర్పణ : ఏపీయూడబ్ల్యూజే
ఏపీయూడబ్ల్యూజే 65వ వ్యవస్థాపక దినోత్సవం, జర్నలిస్టుల రాష్ట్రవ్యాప్త సావధానదినం సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, వర్కింగ్ జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయలు మరియు అర్హులైన అందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపులో భాగంగా విజయవాడ అర్బన్ యూనిట్ తరపున దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, విజయవాడ అర్బన్ అధ్యక్షులు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు కె జయరాజ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, ఎస్కే బాబు, ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు, స్సామ్నా ప్రతినిధులు సీహెచ్ రమణారెడ్డి, ఎంవీ సుబ్బారావు, దాసరి నాగరాజు తదితరులు ఉన్నారు.