-రెడ్ క్రాస్ సొసైటీ కి రూ.5,44,450 చెక్కు అందచేత
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, 332 మంది డ్వాక్రా మహిళలు జీవిత సభ్యత్వం తీసుకోవడం ఎందరికో స్పూర్తి కలిగిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ లో డిఆర్డీఏ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి ఆధ్వర్యంలో రూ.5,44,450 ల చెక్ ను కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు డా గన్ని మహాలక్ష్మి కి అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత పరచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందు కోసం అన్ని వర్గాల ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేసే విధంగా సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిథిలో 18 మండలాల సమాఖ్యల ద్వారా గ్రామ సంఘాల మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 332 స్వయం సహాయక సంఘాల మహిళలు (డ్వాక్రా సంఘాల సభ్యులు) రూ.3 , 65, 200 /- లు జీవిత సభ్యత్వం తీసుకోవడం జరిగిందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పలు అభివృద్ధి పనులను, చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. వాటిని మరింత సమర్థవంతంగా ప్రజల్లో కి తీసుకొని వెళ్లడంలో సభ్యులు కీలకం అన్నారు. అదే సమయంలో రెడ్ క్రాస్ కార్యకలాపాల్లో తమ వంతుగా రూ.1,79,250 లు ఆర్ధిక సహాయం అందచేశారనీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో ఉన్న వారిని, విద్యా సంస్థలను, విద్యార్థులను సభ్యత్వం తీసుకోవడం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంలో డిఆర్డీఏ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి , రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు డా గన్ని మహాలక్ష్మి , అదనపు పిడి వై. సత్యం నాయుడు, రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ పి రాంబాబు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News