Breaking News

ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిపై చర్యలు తీసుకోవాలి…

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం దాణాపురం సర్పంచ్ కుల, మతాల గురించి ప్రస్తావించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లా, ఆదోని నియోజకవర్గం, దాణాపురం సభలో దళితుడైన కారణంగా సర్పంచ్ ను వేదిక మీదకు పిలవకుండా అవమానించిన ఘటన దుర్మార్గం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఈ ఘటనపై క్షమాపణలు చెబుతూ కూడా సర్పంచ్ మతం గురించి ప్రస్తావించటం హేయతిహేయం. నాగరిక సమాజంలో బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా కుల, మతాల ప్రస్తావన తెచ్చిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *