విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎవరు చేయని విధంగా కులమత పార్టీలకతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని డొంకరోడ్డు వద్ద జరిగిన 13 వ డివిజన్ జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కేవలం వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మధ్యలో దళారులు, లంచాలు ఇచ్చే పని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని,ముఖ్యంగా మహిళలకు ప్రతి పథకాల్లో పెద్దపీట వేస్తూ వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకొన్నారని అన్నారు.గత టీడీపీ ప్రభుత్వం లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ అధికార పార్టీలో ఉండి కూడా ఈ డివిజిన్ అభివృద్ధి కి నోచుకోలేదని,కానీ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే రోడ్లు, సైడ్ డ్రైనేజీ,పార్కుల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేశామని తెలిపారు. ఈరోజు వైస్సార్సీపీ నాయకులు ప్రజల మధ్యకు వస్తుంటే అందరూ బ్రహ్మరథం పడుతున్నారు అని,అది చూసి ఓర్చుకోలేక టీడీపీ నాయకులు శవ రాజకీయాలకు తెరలేపారు అని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం లో అన్యాయనికి గురైన ఆడపిల్లలకు ఏమి న్యాయం చేశారో చెప్పలని,మీ నాయకులు మహిళా అధికారులు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కానీ నేడు గుంటూరులో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసారని,ప్రభుత్వ పరంగా బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు.నియోజకవర్గంలో ఎవరికైనా అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వలన పధకం అందకపోతే ఈ పరిష్కార వేదిక ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, డివిజన్ ఇన్ ఛార్జ్ ఉకోటి రమేష్,డివిజన్ కార్పొరేటర్ లు,ఇన్ ఛార్జ్ లు,నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …