ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప (వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ) ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి కుటుంబమునకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ మరియు పాలకమండలి సభ్యులు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.
Tags indrakiladri
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …