Breaking News

స్పందనకు 10 అర్జీలు…

-న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌యవాడ న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమము ద్వారా మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మేయ‌ర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -7, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – 1, యు.సి.డి విభాగం – 1 మొత్తం 10 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉదయ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *