ఘనంగా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం

జంగారెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
జంగారెడ్డిగూడెం చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. ప్రసాద్ బాబు అధ్యక్షత న యువభారత్ ఏలూరు శాఖ వారు,స్పార్క్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో యువత నైపుణ్యం పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశం యొక్క టెక్నాలజీతో పాటు వ్యక్తిగత నైపుణ్యం కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. స్పార్క్ అసోసియేషన్ సెక్రటరీ త్రినాథ్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలో ఉద్యోగాలు లేకపోవటానికి ప్రధాన కారణం వ్యక్తిగత నైపుణ్యం లేకపోవడం అని కావున ప్రతి విద్యార్థి తమ వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. జంగారెడ్డిగూడెం ఎమ్ పి డి వో కె ఆర్ ఎస్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోకపోతే సమాజం వెనుకబడి పోతుందని విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం కావలసిన విద్యతోపాటు నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటే లక్ష్యసాధన సులభం అవుతుందని అన్నారు. స్కిల్ హబ్ కోఆర్డినేటర్ జంగారెడ్డిగూడెం ఎమ్ నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతినెల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని విద్యతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్న వ్యక్తులే ఉద్యోగానికి ఎంపిక అవుతున్నారని కావున విద్యార్థులందరూ విద్యతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కళాశాల ఐ క్యూ ఎ సి కోఆర్డినేటర్ డా.ఎమ్ మధు మాట్లాడుతూ ఒక దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఉంటుందని కావున యువత మంచి నైపుణ్యాలు కలిగి ఉండి వాటిని ఎప్పటికప్పుడు నవీకరణ చేసుకోవటం వల్ల దేశ అభివృద్ధి సులభతరం అవుతుందని అన్నారు. సీనియర్ అద్యాపకులు యు. వెంకటాచార్యులు మాట్లాడుతూ విద్యా మరియు నైపుణ్యం రెండూ కలిస్తేనే ఉపాధి అని అన్నారు. కళాశాల ఉపాధి కల్పన శాఖ కోఆర్డినేటర్ బి అశోక్ మాట్లాడుతూ మనదేశంలో కరోనా అనంతరం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని మనుషులు బయట తిరగలేని పరిస్థితులలో కూడా టెక్నాలజీని ఉపయోగించి అన్ని కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగించారని కావున ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు టివి రాంబాబు, పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు ఎమ్. శ్రీనివాసరావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు జే రాజా శ్రీకాంత్, ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *