Breaking News

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత

-ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 70 వేలు
-విజయవాడ దుర్గ గుడిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-పాదరక్షలు ఎక్కడపడితే అక్కడ వదిలేస్తే ఎలా
-ఆదాయం కన్నా భక్తుల సౌకర్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈవో
-రద్దీ సమయాల్లో టికెట్లు రద్దు చేయడం అనేది భక్తితత్వం
-శీనా నాయక్ సంస్కరణలు
-స్వాగతిస్తున్న అమ్మవారి భక్తులు

అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఆదివారం వేకువజాము నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆదాయం పెంచాం అని చెప్పి గత వైకాపా ప్రభుత్వంలో భక్తుల సౌకర్యాలు విస్మరించారు. కానీ ప్రజా ప్రభుత్వంలో అమ్మవారి భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆలయ ఈవో శీనా నాయక్ టికెట్లని రద్దుచేసి రద్దీ సమయంలో త్వరగా అమ్మవారి దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టారు చంటి పిల్లల తల్లులకు, దివ్యాంగులకు వృద్ధులకు లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. శీనా నాయక్ చేపట్టిన సంస్కరణలను భక్తులు స్వాగతిస్తున్నారు.

విజ‌య‌వాడ (దుర్గ గుడి), నేటి పత్రిక ప్రజావార్త :
జై భవాని.. జై జై భవాని..
అమ్మవారి నామస్మరణ తో ఇంద్రకీలాద్రి మార్మోగింది. ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ఏ ప్రాంతంలో విన్న భక్తులు నామస్మరణమే. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఆషాఢ సారె సమర్పణకు మహిళలు వేలాది మంది తరలి రావడంతో ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు అన్ని దర్శనం క్యూలైన్లలో భక్తులను టికెట్ లేకుండా అనుమతించినట్లు ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. టికెట్ అమ్మకాలు ద్వారా వచ్చే ఆదాయం కన్నా భక్తుల సౌకర్యం, భద్రత ప్రధానము గా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు శీనానాయక్ పేర్కొన్నారు. అంతరాలయ దర్శనం, వి ఐ పి దర్శనం రద్దు చేసి సామాన్య భక్తులకే ప్రధమ ప్రాధాన్యత కల్పించామని, కేవలం వికలాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు, డవలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే లిఫ్ట్ ప్రవేశం కల్పించామన్నారు. ప్రధానమైన లిఫ్ట్ మార్గం లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లను, మహా మండపం ప్రతీ అంతస్తుకి అధికారులను నియమించి పర్యవేక్షణ చేయించిన ఫలితంగా మధ్యాహ్నం 3 గంటలకు 62,426 మందికి దర్శనం సజావుగా జరిగిందని ఈవో ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి 70000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

పాదరక్షలు ఎక్కడపడితే అక్కడ వదిలేస్తే ఎలా
మహిమాన్విత ఇంద్రకీలాద్రిని పరిశుభ్రతగా ఉంచేందుకు గానూ పారిశుద్యం మెరుగు పర్చేందుకు భక్తులందరికి ఉచితంగా పాదరక్షలు భద్రపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉచితంగా భక్తులకు అవకాశం కల్పించినా, భక్తులు పాదరక్షలు ఎక్కడ పడితే అక్కడ విడిచి పెడుతున్నారని దేవస్థాన అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం వదులుకొని భక్తుల కోసం ఉచితంగా నిర్వహిస్తున్నా ఈ అవకాశాన్ని వినియోగించకోవట్లేదని ఈవో ఆవేదన వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవి తరగతి సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *