-ఆర్ అండ్ బీ ఈఈ తో కలసి రహదారులను పరిశీలించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
మంజూరైన రహదారులు నిర్మాణం గతంలో మాదిరిగా కాకుండా అవసరమైతే అదనపు నిధులు తెచ్చి పటిష్టంగా నిర్మిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆర్ అండ్ బీ ఈఈ యం. శ్రీనివాసరావుతో కలసి శాసనసభ్యులు డిఎన్ఆర్ కలిదిండి మండలంలోని కొండంగి, మట్టగుంట గ్రామాలల్లోని రహదారులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక నాయకులు, ఆర్ అండ్ బీ అధికారులతో పలు గ్రామాల రోడ్ల నిర్మాణాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మట్టగుంట గ్రామంలో, మెయిన్ రోడ్డు నుంచి రేవు వరకు 4 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షల అంచనాలతో రోడ్డు పనులు మొదలుపెడతామన్నారు. మట్టగుంట గ్రామ నాయకులు సొంతంగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం పనులు చేస్తారని తెలిపారు. అదేవిదంగా కొండంగి నుంచి పెద్దలంక మెయిన్ రహదారి ఆర్ అండ్ బీ రోడ్డు కొండంగి గ్రామం వరకు రూ. 39 లక్షలు రూపాయలు ఇప్పటికే అనుమతులు తీసుకువచ్చాయన్నారు. ఫ్లడ్ డామేజ్ రిపేర్లు ద్వారా రూ.39 లక్షలు రూపాయలు పనులు కూడా కొండంగి గ్రామంలో మొదలుపెడతామన్నారు. అడిగిన వెంటనే మాతో కలిసి రహదారులను పరిశీలించేందుకు వచ్చిన ఆర్ అండ్ బీ ఈ ఈ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈఈ జేమ్స్, జేఈఈ రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయం సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, కొల్లాటి సత్యనారాయణ, పడవల శ్రీనివాస్, తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, ఆండ్రాజు కృష్ణమూర్తి,పోసిన రాజ్ భరత్, చిట్టూరి బుజ్జి, కోకా తాతాజీ,, బొమ్మిడి జనార్దన్, ఇమ్మానేని లక్ష్మణ్, చిట్టూరి వాసు,,కురేళ్ళ రాజారత్నం,, ముద్దం రామకృష్ణ,, తిరుమాని రమేష్, ఆండ్రాజు దుర్గారావు, తిరుమాని నాగరాజు, కొల్లాటి నాగరాజు, గుడివాడ ఫణి కుమార్, రేవు నరసింహ, సాగి వాసురాజు, బస్వాని వెంకటరాజు, కోకా ఏకోనారాయణ, తదితరులు పాల్గొన్నారు.