Breaking News

అర్హ‌త ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాలు చేరువ చేయాలి… : డిప్యూటి మేయ‌ర్ బెల్లందుర్గ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న వైసీపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, అర్హ‌లైన ప్రతి ఒక్క‌రికి సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నే ల‌క్ష్యంతో సిటిజన్‌ అవుట్‌ రీచ్ కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌ని డిప్యూటి మేయ‌ర్ బెల్లందుర్గ అన్నారు. అందులో భాగంగా శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ అదనపు కమీషనర్ డా. జె. అరుణ తో క‌లిసి రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌లోని స్లమ్ లెవల్ ఫెడరేషన్, డ్రాక్వా గ్రూపు స‌భ్యులు, వార్డు వెల్‌పెర్ డ‌వ‌ల‌ప్ మెంట్ సెక్ర‌ట‌రీల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. సిటిజన్‌ అవుట్‌ రీచ్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి నెల ఆఖ‌రి శుక్ర‌వారం, శ‌నివారాలలో వార్డు వాలంట‌రీల‌తో పాటు అడ్మిన్ కూడా డివిజ‌న్ ప‌ర్య‌టించి, అర్హ‌త ఉండి వివిధ కార‌ణాల‌తో సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని వారిని గుర్తించి వారికి సంక్షేమ ప‌థ‌కాల‌ను చేరువ చేయాల‌నే సిటిజన్‌ అవుట్‌ రీచ్ ప్రాగాం రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. స‌చివాల‌య‌ల్లో అందుతున్న 543 సేవ‌లు ప్ర‌జ‌లు చేరువ చేయాల‌నే, ప్ర‌జ‌లు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న విధానంపై అనందంగా ఉన్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *