
-నేతన్న బతుకుల్లో వెలుగులు నింపుతున్న వైఎస్సార్ నేతన్ననేస్తం…
-ఒక్కో కుటుంబం ఖాతాకు రూ.24 వేల చొప్పున జమ…
-కృష్ణా జిల్లాలో మూడు విడతల్లో 81.54 కోట్లు అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ చేనేత కార్మికుడి అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఇస్తున్న అపూర్వ కానుక వైఎస్సార్ నేతన్న నేస్తం, నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపి చేనేత వృత్తికి గత వైభవం తీసుకువచ్చేందుకు అమలు చేస్తోన్న వైఎస్సార్ నేతన్న నేస్తం నేతన్నల పాలిట అపన్న హస్తంగా మారింది.
నేతన్నల కష్టనష్టాలు, ఆత్మాభిమానం, చేనేత అక్కచెల్లెమ్మల గుండెచప్పుడు విన్న జగనన్న చేనేత సోదరుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాత వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. చేనేత కార్మికుల స్థితిగతులను కొంతవరకైన మెరుగుపర్చి వారి జీవన ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా ఈ అపూర్వ పథకానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందించడంతో ఆయా కుటుంబాల్లో గణనీయమైన మార్పు కనబడుతోంది.
కృష్ణా జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4292 మంది లబ్ధిదారులకు రూ.10.30 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద జిల్లాలో మూడు విడతల్లో 31.54 కోట్లు అందజేశారు.
పెడనకు చెందిన కట్టా వెంకటస్వామి; చేనేత పరిశ్రమ ఏమిబాగోలేదు. సరుకు, చీరలు కొనేవారు లేరు. సరైన ధరలు లేవు. నూలు రేటు పెరిగింది. ఇటువంటి కష్టసమయంలో వైఎస్సార్ నేతన్న నేస్తం కొంత ఆదుకుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం. ప్రస్తుతం నూలు రేటు పెరగడంతో నేయించే వారు లేరు. రంగుల ధరలు పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏడాదికి రూ.24 వేలు చొప్పున నేతన్న నేస్తం ఆదుకోకపోతే మా పరిస్థితి దారుణంగా వుండేంది. ఇటువంటి సహాయం అందకపోతే చేనేత వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి వుంటుంది.
వుట్ల మధుబాబు: ప్రతీ ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ. 24 వేలు మాకు అందడం చాలా ఆనందంగా వుంది. ఆ డబ్బుతో మగ్గం ఆధునీకరించుకుని ఎక్కువ సంపాదనకు ఉపయోగపడుతోంది.
బల్లి కృష్ణవేణి : గవర్నమెంటు నాకు నేతన్న నేస్తం కింద రూ. 24 వేలు సహాయం అందించడంతో నేతపని ముందుకు సాగుతోందన్నారు. దాంతో సంతోషంగా వుందన్నారు.
కొసనం వాసు, పోలవరం, గూడురు మండలం: వైఎస్సార్ నేతన్న నేస్తం కింద మూడు విడతలుగా లబ్ధి పొందాను. గుంటమగ్గం మూలంగా వర్షాలు పడినపుడు పని చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేతన్న నేస్తం ఆర్థిక సాయంతో స్టాండ్ మగ్గం ఏర్పాటు చేసుకున్నాను. ఆధునిక రకాలు తయారీ చేయడం ద్వారా మెరుగైన ఆదాయం పొంది గౌరవంగా జీవిస్తున్నాం. తన కుమారుడుకు అమ్మఒడి ఆర్థిక సహాయం పొందాడు.
Prajavartha Online Telugu News