Breaking News

కృష్ణాజిల్లాలో మెగా వాక్సినేషన్ డ్రైవ్ విజ‌య‌వంతం… : క‌లెక్ట‌ర్ నివాస్‌

-లక్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు
-అధికారులు, సిబ్బందిని అభినందించిన క‌లెక్ట‌ర్ నివాస్‌
విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మెగా వాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం అయిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ తెలిపారు. ల‌క్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు వేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతం చేసిన ఎఎన్‌యం, ఆశ కార్యకర్తలు, విఏఓలు, వీఆర్వోలు, వాలంటీర్ల‌కు అభినందనలు తెలిపారు. వాక్సినేషన్ మండల అధికారులకు, మున్సిప‌ల్ కమిషనర్లకు, వైద్యుల‌కు క‌లెక్ట‌ర్ నివాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *