-ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం మారుతీనగర్ అల్లూరి సీతారామరాజు వంతెన సెంటర్ వద్ద 26వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని శాసనసభ్యులు మల్లాది విష్ణు డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణం పరిష్కరించేదుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలపై డివిజన్ ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ.. వారికి భరోసా కలిగించాలన్నారు. అర్హులకు లబ్ధి చేకూరుతుందో లేదో పరిశీలించాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో లోపాలను సరిచేసుకుంటూ.. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధన కోసం కృషి చేయాలనే దృఢ సంకల్పంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు నాగ ఆంజనేయులు, అన్సారీ బేగ్, పారా ప్రసాద్, డి.శంకర్, కాళిదాసు, రమణ తదితరులు పాల్గొన్నారు.