-ఎంపిక చేసిన గ్రామాల్లో అక్టోబరు నాటికి రీ సర్వే పనులుల పూర్తి చేస్తాం…
-అంగలూరు గ్రామంలో 679 సర్వేనెంబర్లలో 2856.65 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశాం.. … జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె. మాధవీలత
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శతాబ్ధ కాలం తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.
శనివారం జాయింట్ కలెక్టరు(రెవెన్యూ) మాధవీలతతో కలసి గుడ్లవల్లేరు మండలం అంగళూరు గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రారంభించారన్నారు. సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. కృష్ణా జిల్లా లో తొలుత ఈ ప్రాజెక్టు పనులను జగ్గయ్యపేట మండలం, తక్కెళ్లపాడు గ్రామంలో సీఎం శ్రీ వైయస్ జగన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిచారని మంత్రి అన్నారు. ఈ రీ సర్వే ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు వచ్చేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వేను ప్రభుత్వం చేపట్టిందన్నారు.
జాయింట్ కలెక్టరు కె. మాధవీలత మాట్లాడుతూ వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్ సహాయంతో రీసర్వే పనులను వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో తొలుత రీ సర్వే పనులను ఆధునాతన టెక్నాజితో చేపట్టి చేస్తున్నామన్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో గుడ్లవల్లేరు, పామర్రు మండలాల్లోని 50 గ్రామాల్లో క్లస్టర్ మోడ్ లో డ్రోన్ సహాయంతో గ్రామ సరిహద్దులు, భూముల సరిహద్దులను నిర్ణయించే విధంగా రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టి పనులు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గుడ్లవల్లేరు మండలం లో 24 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని ఇప్పటివరకు 9గ్రామాల్లో వేముగుంట, వేమవరప్పాడు, వేమవరం, నాగవరం, చిత్రం, కూరాడ, చెరువుపల్లి, చంద్రాల, అంగళూరు గ్రామాల్లో డ్రోన్ ద్వారా రీ సర్వే పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాల్లో అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. నేడు అంగళూరు గ్రామంలో 679 సర్వేనెంబర్లలో 2856.65ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశామన్నారు. రీ సర్వే కు గుడివాడ డివిజన్ పరిధిలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. అక్టోబరు చివరి నాటికి ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తి చేస్తామన్నారు. రీ సర్వే పూర్తయిన అనంతరం సర్వేపై ప్రజలకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సంబందింత తాహశీల్థారు కార్యాలయంలో తెలియజేయాన్నారు. రీ సర్వే అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో (ఇఛార్జి) ఆర్డీవో ఎన్. ఎస్.కె.ఖాజావల్లి, డీఐ. సర్వే నరశింహారావు, ఏడీ సర్వే సూర్యారావు, తాహశీల్ధార్ కె.ఆంజనేయులు,మండల సర్వేయర్ బి. రామకృష్ణ,ఆర్ ఐ. అక్బర్ ఖాన్, ఇవో పిఆర్డీ దిలీప్ కుమార్, స్థానిక ప్రజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.