Breaking News

పంచాయతీ చెరువు లీజుదారుకు నష్టపరిహారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి…

-డీపీవోతో మాట్లాడిన మంత్రి కొడాలినాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గపరిధిలోని బాపులపాడు మండలం కాకులపాడు పంచాయతీచెరువు లీజుదారుకు నష్టపరిహారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్రపౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలిశ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. శనివారం  గుడివాడ పట్టణంరాజేంద్రనగర్లోనినివాసంలో మంత్రికొడాలినానినిగుడివాడకు చెందిన చింతపల్లివిజయభానుమూర్తి కలిశారు. ఈసందర్భంగాభానుమూర్తిమాట్లాడుతూ కాకులపాడుపంచాయతీచెరువులోచేపలనుసాగుచేసుకునేందుకుమూడేళ్ళకాలపరిమితికివేలంపాటజరిగిందన్నారు.తనసోదరుడుచింతపల్లిఉదయసాంబశివరావుహెచ్చుపాటపాడి 2019 నుండిచేపలనుసాగుచేస్తున్నారన్నారు.2020 డిసెంబర్నెల్లోరెండవక్రాప్గా 15 వేలచేపలపిల్లలను చెరువులో వేశామన్నారు.అవిఒక కిలోవరకుబరువుపెరిగాయన్నారు. చేపలుపట్టుబడికిసిద్ధంగాఉండగా గుర్తుతెలియనివ్యక్తులుచెరువులో విషప్రయోగంచేశారన్నారు. దీంతోచెరువులోని చేపలన్నీచనిపోయాయనిచెప్పారు. దాదాపురూ.15 లక్షల మేరనష్టంవాటిల్లిందని తెలిపారు. మత్స్యశాఖ అధికారులు చెరువువిస్తీర్ణాన్నికొలవగా 2.33 ఎకరాలువచ్చిందని, ఇదేచెరువును ఐదెకరాలు ఉందంటూ తనతో ఎక్కువమొత్తానికి వేలంపాటపాడించారన్నారు. లీజుకుతీసుకునివేసిన మొదటిక్రాప్ను కూడాపలు సమస్యలు ఎదురుకావడంతో నష్టపోయానని చెప్పారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునినష్టపరిహారం ఇప్పించిఆదుకోవాలని భానుమూర్తికోరారు. విషప్రయోగానికిసంబంధించిన ఫొటోలనుమంత్రికొడాలినానికిచూపించారు. ఈమేరకు హనుమాన్జంక్షన్పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టుతెలిపారు. వెంటనే మంత్రికొడాలినాని డీపీవోతోఫోన్లోమాట్లాడారు. ఫిషరీస్డిపార్ట్మెంట్కమిషనర్దృష్టికికూడాఈవిషయాన్నితీసుకెళ్ళారు.అలాగేగన్నవరంఎమ్మెల్యేవల్లభనేనివంశీనికలిసిపూర్తివివరాలనుఅందజేయాలనిసూచించారు.కాకులపాడుపంచాయతీచెరువులోవిషప్రయోగానికిసంబంధించినవిషయాలనుపరిశీలించి, అవకాశం ఉంటేలీజుదారుకు నష్టపరిహారం అందేలా చూడాలనిఅధికారులను ఆదేశించినట్టు మంత్రికొడాలినాని చెప్పారు. ఈ కార్యక్రమంలోజగన్సేవాదళ్రాష్ట్రగౌరవాధ్యక్షుడు, గుడివాడ వైఎస్సార్కాంగ్రెస్పార్టీసోషల్మీడియాఇన్ఛార్జి తోటరాజేష్తదితరులుపాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *