విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కాటంనేని భాస్కర్ మంగళవారం అమరావతి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్స్ డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో చేయవలసిన కార్యక్రమలు దీనిపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఉత్తర్వుల వివరాలను వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నందిగామ తహాశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎల్, శివశంకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం. సుహాసిని జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తదితరులు తమ కార్యాలయాల నుంచి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …