విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన, లింగ ఎంపిక నిషేధ చట్టంలో పొందుపరచిన నియమాలు అతిక్రమించిన అటువంటి సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ హెచ్చరించారు.
మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిపిఎ టి డివిజన్ స్థాయి కమిటీ సమావేశం జరిగింది. గర్భస్థ పిండ ఆరోగ్య స్థితిని పరీక్షించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునిక వైద్య సాంకేతిక విజ్ఞానాన్ని మానవ కళ్యాణానికి మాత్రమే వినియోగించాలే తప్ప దుర్వినియోగం చేయడం తగదన్నారు. సమాజంలో స్త్రీ పురుషులు ఇరువులు సమానమే అని అన్నారు. ఈ విషయంలో ఏ విపక్షత ఉండకూడదన్నారు. లింగ ఎంపిక నిషేధ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒక సారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ప్రతీ మూడు నెలలకు ఒక సారి న్యూస్ లేటర్ విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో మహిళల రక్షణకు సంబంధించి చట్టాలు, దిశ యాప్ గురించి వివరాలను కూడా ఫోటోలతో ప్రచురించాలన్నారు. ఇందుకు సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న ఎకైఓలు భాగస్వామ్యం వహించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటి డిఎంహెచ్ఓ డా. ఇందుమతి, భూమిక ఉమెన్స్ సంస్థ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పి. ఉమాదేవి, కౌన్సినర్ జె. అనుపమ , వరల్డ్ విజన్ ఇండియా సీనియర్ మేనేజర్ తబిత ఫ్రాన్సిస్, పిసి ఎన్ డిటి ప్రోగ్రాం ఆఫీసర్ డా, రుక్షణ, డా. అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …