Breaking News

జగనన్న స్వచ్ఛ సంకల్పం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు పిలుపునిచ్చారు స్థానిక సారధి ఇంజినీరింగ్ కళాశాలలో జగనన్న స్వచ్ఛసంకల్పం నూజివీడు నియోజకవర్గ స్ధాయి వర్క్ షాప్ కార్యక్రమంపై గ్రామ సర్పంచులు, అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్ది ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే విధానాన్ని ప్రతి గ్రామంలో అమలు చేయాలని, తడి చెత్త పొడి చెత్త విడివిడిగా సేకరించాలన్నారు. అదేవిధంగా గ్రామం శివార్లలో డంపింగ్ యార్డ్ లో ఏర్పాటు చేసి సేకరించిన చెత్తను వేయాలన్నారు. గ్రామంలో ఎక్కడ చెత్త లేకుండా పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.చెత్త నిలవ ఉంటే దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడతారని విషసర్పాలు కారణంగా ప్రజలు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు కావున సర్పంచులు అందరూ గ్రామ పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రతీ పల్లె సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దేదుకు కృషి చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జ్యోతి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సర్పంచ్ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, గ్రామాన్ని పరిశుబ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తడిచెత్తవేయడానికి, పొడి చెత్త వేయడానికి రెండు చెత్త బట్టలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామ పరిశుభ్రతకోసం అవసరమైతే ఉపాధిహామీ పథకం నిధులు కూడా ఉపయోగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామ పరిశుభ్రతలో ప్రజలు కూడా బాగస్వాములుగా ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. సమావేశంలో యం.పిడివోలు జి. రాణి, పి. భార్గవి, డిఎల్పివో ప్రబాకరరావు, నియోజకవర్గ గ్రామాలకు చెందిన సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *