Breaking News

సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నిరసన ప్రదర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యములోని కేంద్ర ప్రభుత్వం రైల్వే మార్గాలను, రైళ్లను, రైల్వే స్టేడియం లను, దేశము లో కెల్లా ప్రఖ్యాతి గాంచిన హిల్ స్టేషన్ లను మరియు రైల్వే స్టేషన్ లను మానిటైజేషన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయటాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దేశ వ్యాప్త నిరసన ప్రదర్శనలో భాగముగా బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యములో డీజిల్ లోకో షెడ్ ఆవరణలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని నిరసన తెలియ చేసారు. ఈ కార్యక్రమములో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ సెక్రెటరీ జి ఎన్ శ్రీనివాస రావు మాట్లాడుతూ తర తరాలుగా రైల్వే కార్మికులు చెమటోడ్చి సంపాదించిన రైల్వే ఆస్తులను ప్రైవేట్ పరం చేయటం అన్యాయం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ పేరుతో400 రైల్వే స్టేషన్ లను, 90 ప్రయాణికుల రైళ్లను, రైల్వే కు లాభాలను తెచ్చే గూడ్స్ రవాణా మార్గాన్ని, 15 రైల్వే స్టేడియం లను మరియు అనేక రైల్వే స్థలాలను ప్రైవేట్ వారికి అప్ప చెప్పటం సహేతుకం కాదని విమర్శించారు. ఈ చర్యల వలన రైల్వే చార్జీల భారం తప్పదని హెచ్చరించారు. రైల్వే లను అమ్మే మానిటైజేషన్ ప్రక్రియ విరమించే వరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మరియు అల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ పోరాటం చేస్తాయని ఈ సందర్భముగా శ్రీనివాస రావ్ గారు తెలియ చేసారు . అలాగే డివిజన్ వ్యాప్తముగా జరిపిన నిరసన ప్రదర్శనలలో పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికులు పాల్గొని విజయవంతం చేసారని కామ్రేడ్ జీ ఎన్ శ్రీనివాస రావు గారు తెలియ చేసారు.ఈ కార్యక్రమములో జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లీల గారు , ఇంజనీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ సాయి కుమార్, c &w బ్రాంచ్ సెక్రటరీ సుబ్బా రావు, లోకో మెకానికల్ బ్రాంచ్ సెక్రటరీ వెంకటేశ్వర రావు , ఎలక్ట్రికల్ బ్రాంచ్ సెక్రటరీ భాను బాబు , ఎలక్ట్రికల్ లోకో షెడ్ బ్రాంచ్ సెక్రటరీ శేఖర్ బాబు గార్లు మరియు పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికులు పాల్గొని నిరసన ప్రదర్శనలను విజయవంతం చేసారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *