Breaking News

రహదారి భద్రత అవగాహన కార్యక్రమం….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
FCTS మరియు డ్రైవింగ్ ట్రాక్ గన్నవరం ప్రాంగణంలో బుధవారం దాదాపు 200 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు మరియు భారీ వాహన డ్రైవర్లు కు VHEEDU ROAD SAFETY NGO డైరెక్టర్  వాసు అసోసియేషన్‌తో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి RTO శ్రీ సారధి ముఖ్య అతిథి గా పాల్గొని డ్రైవర్స్ కు రహదారి పై పాటించవలిసిన భద్రత విషయాలు తెలియజేయటం జరిగినది NGO డైరెక్టర్  వాసు మరియు ఐషర్ మోటార్స్‌కు చెందిన జాన్ డేవిడ్ భద్రతా డ్రైవింగ్ చిట్కాలను డ్రైవర్లకు తెలియజేసినారు . ఈ కార్యక్రమములో డాక్టర్ శ్రీ హరీష్ గారు తన వైద్యుల బృందంతో కలిసి రోడ్డు ప్రమాదము లో గాయపడిన బాధితులకు మరియు స్కూల్ బస్సులో ఉన్న పిల్లలు అనుకోకుండా ఏదైనా నాణేలు, రబ్బర్లు మొదలైన వస్తువులను మింగితే… డ్రైవర్ ప్రథమ చికిత్స చేసే పద్దతులను ప్రాక్టికల్ గా ప్రదర్శించటం జరిగింది . గన్నవరం అగ్నిమాపక స్టేషన్ అధికారి సుబ్రమన్యం గారు తన బృందంతో కలిసి వాహనాలలో అగ్ని ప్రమాదాల నివారణ మరియు మంటలను ఆర్పడం మొదలైన విషయాలు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోటార్ వెహికిల్ ఇన్సపెక్టర్స్ G. సంజీవ్ కుమార్, G. నాగ మురళి, M.V.N రాజు, B. భీమారావు, DSS నాయక్ KSN ప్రసాద్ ఆధ్వర్యములో నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమములో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవింగ్ స్కూల్ మరియు మైలవరం బెస్ట్ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది పాల్గొనటం జరిగినది..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *