Breaking News

కొరమేను సీడ్ తయారీ విధానాన్ని పరిశీలించిన రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు…

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కైకలూరు నియోజకవర్గం లో కొర్లపాడు గ్రామంలో కొరమేను హెచరిలో కొరమేను పిల్లల తయారీని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తో కలసి కొర్లపాడు లో గల కొరమేను హెచరిలో కొరమేను సీడ్ తయారీని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విజయదుర్గ కొరమేను హెచరిలో కొరమేను గుడ్డు నుంచి కొరమేను సీడ్ తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరపాలెం లో గల చేప,రొయ్యలు ఫుడ్ తయారీ కేంద్రమైన గ్రోవెల్ ఫ్యాక్టరీ ని పరిశీలించారు. తొలుత స్థానిక శాసనసభ్యులు  దూలం నాగేశ్వరరావు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కు పుష్ప గుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి వెంట గ్రోవెల్ యాజమాన్యం, పొట్లూరి శ్రీనివాస్ నరేంద్ర, చింతపల్లి సుదీర్, పొట్లూరి శ్రీనివాస్, దూలం వినయ్ కుమార్, నర్శిపల్లి రవి, నిమ్మగడ్డ నారాయణ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రూ.1.30 కోట్లతో నిర్మించిన చిక్కవరం–పురుషోత్తపట్నం రహదారిని ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-రూ.53.90 లక్షలతో తాగునీటి పథకం ప్రారంభం.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం -గోపవరపుగూడెంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *