Breaking News

అవనిగడ్డ నియోజకవర్గంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి…

-ఎమ్మెల్యేతో కలసి సమీక్ష నిర్వహించిన కలెక్టర్

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధవారం అవనిగడ్డ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలసి నియోజకవర్గంలో గృహనిర్మాణం, ఉపాధిహామీ, ఆర్ బీకే, హెల్త్ సెంటర్, సచివాలయ భవన నిర్మాణాలు మండలం, గ్రామాల వారీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద నిరుపేదలకు ప్లాట్లు ఇచ్చి, లెవెలింగ్ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, గృహాలు నిర్మించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్దిదారులు గృహాలు నిర్మించుకొనుటకు బేస్మెంట్ లెవెల్ 60 వేలు, రూఫ్ లెవెల్ 60 వేలు, పూర్తి అయ్యాక 60 వేలు మొత్తం లక్షా 80 వేలు అందజేస్తున్నామని, ఈ మొత్తానికి అదనంగా డ్వా క్రా గ్రూపులలో మహిళలకు 50 వేల రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా బేస్మెంట్ లెవెల్ ఇచ్చే మొత్తం సరిపోని లబ్దిదారులకు ఇండియన్ బ్యాంకు ద్వారా లక్ష రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు సౌకర్యం కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఇంటికి 40 బస్తాల సిమెంట్, 350 కేజీల ఇనుము, 10 మెట్రిక్ టన్నుల ఇసుక అందజేస్తున్నామని ఇన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం అందిస్తున్నందున లబ్దిదారులు ముందుకు వచ్చి గృహాలు నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎడ్ల బండ్లతో ఇసుక రవాణా చేసుకునే లబ్దిదారులకు ఇబ్బందులు కల్గించకూడదన్నారు. పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసుకుని వ్యాపారం చేసేందుకు ఎడ్ల బండ్లతో రవాణా చేస్తుంటే మాత్రం తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు పేమెంట్ విధానాన్ని సులభతరం చేసిందని, ఈ అంశంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని, ప్రతి గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్దిదారులను మోటివేట్ చేసి రోజుకు కనీసం 5 గృహాలు బేస్మెంట్ వేసుకునేలా చూడాలన్నారు. గృహ నిర్మాణాల పై అధికారులు పూర్తి శ్రద్ధ పెట్టాలని, అధి కారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు.
అనంతరం ఉపాధిహామి క్రింద నిర్మిస్తున్న సచివాలయ భవనాలు హెల్త్ సెంటర్ ల భవనాల, ఆర్ బి కేల భవనాల నిర్మాణాల ప్రగతి సమీక్షించారు. ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని వాటిని వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా ఉపాధి హామి చెల్లింపులు జరుగుతాయన్నారు. ముఖ్యంగా సచివాలయాల సెకండ్ ఫ్లోర్ స్లాబ్ పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నియోజక వర్గంలో కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాల్లో ఒక్కో మండలంలో 2 చొప్పున 6 సచివాలయ భవనాలు నాన్ స్టార్టెడ్ భవనాలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. బల్క్ మిల్స్ సెంటర్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని, గృహ నిర్మాణాలు రోజువారి సమీక్ష చేయాలన్నారు.

అత్యధికంగా గృహనిర్మాణాలు ప్రారంభించిన గ్రామాల సర్పంచ్ లను కలెక్టర్ అభినందించారు…

ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ లబ్దిదారులతో గ్రూపులు ఏర్పాటు చేయాలని గ్రూపు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టిన తరువాత మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని, గృహ నిర్మాణాల లబ్దిదారుల నీటి సౌకర్యం కోసం ముందుగా వరలతో తొట్లు కట్టించాలని, బేస్మెంట్ వేసే సమయంలోనే లెట్రిన్స్ నిర్మాణం కూడా చేపట్టాలని లెట్రిన్ నిర్మించే ముందు అడుగున మందపాటి పాలిధిన్ షీట్ వేసి నిర్మాణం మొదలు పెడితే ఖర్చు తగ్గుతుందని సూచించారు. లే అవుట్ల దగ్గరలో సిమెంటు, ఇనుము నిల్వ కోసం గోడౌన్ ఏర్పాటు చేయాలి, సిమెంటు గట్టి పడకుండానే లబ్దిదారులకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. 22ఎ భూముల సమస్యలతో రైతుల ఇబ్బందులు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

నాచుగుంటలో ఉప్పుకట్ట సమస్య పరిష్కరించిన కలెక్టర్, ధన్యవాదాలు తెలిపిన రైతులు :
నాగాయలంక మండలం నాచుగుంటలో ఏళ్ల తరబడి ఉన్న ఉప్పుకట్ట సమస్యకు పరిష్కారం లభించింది. ఇటీవల నాచుగుంటలో ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్ పర్యటించినప్పుడు ఎమ్మెల్యే, రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యలు విని, కృష్ణానదికి వరద సమయంలో తరచు కోతకు గురై గండి పడుతున్న ఉప్పుకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ తక్షణం స్పందించి ఉపాధిహామి క్రింద పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలతో సుమారు 9 లక్షల వ్యయంతో 500 మీటర్ల నిడివి కృష్ణానది ఉప్పుకట్టను పునఃనిర్మించగా సైకం నాగజ్యోతి, రైతులు ఎమ్మెల్యే సమక్షంలో కలెక్టరును కలసి కృతజ్ఞతలు తెలిపి కలెక్టర్ను శాలువతో సత్కరించి పుష్పాగుచ్చాం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, హౌసింగ్ శ్రీనివాస్ నూపుడ్, అజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆసరా మోహన్ కుమార్ , దివిసీమ మార్కెట్ యార్డు చైర్మన్ కడవకోల్లు నరసింహారావు ఆర్ డివో ఎస్ఎస్ కె, ఖాజావలి, డ్వామా పిడి జివి సూర్యనారాయణ, హౌసింగ్ పిడి కె.
రామచంద్రన్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు, హౌసింగ్, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *