Breaking News

అలరించిన చిన్నారుల ‘దుర్గమ్మ’ నృత్య ప్రదర్శనలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం మహానగరం గాజువాకలో అతిపెద్ద సెలస్ట్ అపార్ట్మెంట్ లో వందలాది మంది నివాసితుల మధ్య దుర్గమ్మ ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ప్రధానంగా మహిషాసుర మర్ధని, దుర్గమ్మ దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్వదినాల్లో ఇలాంటి నృత్య రూపకాలు వాడవాడలా ప్రదర్శితమయ్యేలా పెద్దలు శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు నిర్వాహకులను, చిన్నారులను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అధికారులకి ఆదేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో కార్మికులు, వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు ద్వారా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *