-కరోనా సమయంలో రూ .6400 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నాం…
-మార్కెఫెడ్ ఆవిర్భావ దినోత్సవ సదస్సులో మంత్రి కన్నబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ప్రతి సందర్బములో సీఎం వై ఎస్ జగన్ అండగా వుంటున్నారని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెస్సింగ్ శాఖల మంత్రి కన్నబాబు అన్నారు. ఆదివారం విజయవాడ లోని ఏపీ మార్కెఫెడ్ భవనంలో నూతన కాన్ఫెరెన్స్ హాల్ను మంత్రి ప్రారంభించారు . అనంతరం ఏపీ మార్కెఫెడ్ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్బముగా ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిధిగా మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ త్వరలో మార్కెఫెడ్ నుంచి రైతులకు మరిన్ని సేవలు అందనున్నాయని , మరింతగా మార్కెఫెడ్ కార్యకలాపాలను విస్త్త్రుతం చేస్తున్నామని మంత్రి చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సుమారు రూ 6400 కోట్ల తో 19 లక్షల టన్నుల పైచిలుకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశామని చెప్పారు. రైతు అవసరాలకు తగ్గట్టు 2020-21 లో ఎరువులను ఆర్బీకే ల ద్వారా 121718 టన్నులను, 430995 టన్నుల ఎరువులను సహకార సంఘాల ద్వారా సరఫరా చేశామన్నారు . కేంద్ర ప్రభుత్వం ప్రకంటించని 6 ఇతర ( మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తయి పంటలకు సీఎం జగన్ మద్దతు ధర ప్రకటించి రైతులకు మద్దతిచ్చారని మంత్రి తెలిపారు . తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్కెఫెడ్ ద్వారా పొగాకు రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద రూ . 119 కోట్ల విలువైన 12.93 మిలియన్ కిలోల F C V పొగాకు కొనుగోలు చేశామన్నారు. ఆర్ బి కె / గ్రామ స్థాయిలో పంట కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రము మన ఆంద్రప్రదేశ్ అని మంత్రి చెప్పుకొచ్చారు. అనంతరం ఏపీ మార్కెఫెడ్ కు “రైతే రాజు” అనే అర్ధం వచ్చేలా నూతన లోగోను మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు. మార్కెఫెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మరో కంపెనీ “మార్క్ అప్” కి సంబందించిన మార్కప్ బ్రోచర్ , ఆన్ లైన్ వెబ్ సైట్ ను మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు మార్కెఫెడ్ చైర్మన్ పి పి నాగి రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ (మార్కెటింగ్ & కోఆపరేషన్ ) మధుసూదన్ రెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, రిజిస్ట్రార్ కో పెరటివేస్ అహ్మద్ బాబు, సివిల్ సప్లైస్ ఎండి వీరపాండ్యన్, అప్కోబ్ ఎండి డాక్టర్ శ్రీనాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు