అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసి త్వరలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న ఆదిత్యానాధా దాస్ కు వీడ్కోలు, నూతన సిఎస్ గా బాధ్యతలు చేపడుతున్న డా.సమీర్ శర్మ కు స్వాగత సభ నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ గా పదవీ విరమణ చేస్తున్న ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపాలన్నదే తన లక్ష్యమని ఆదిశగా తనవంతు ప్రయత్నం చేస్తున్నానని పునరుద్ఘాటించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన తొలి ఇన్నింగ్స్ ను పూర్తి చేసుకుని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించ బోతున్నట్టు చెప్పారు. ఆంద్రప్రదేశ్ లో అధికారులు,సిబ్బంది అంతా కలిసి ఒక టీం వర్కుగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేశానని పేర్కొన్నారు. పదేళ్ళ పాటు నీటిపారుదల శాఖలో తాను పనిచేశానని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి యావత్ ప్రభుత్వ యంత్రాంగానికి తనకు కల్పించిన మంచి అవకాశాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆదిత్యానాధా దాస్ పేర్కొన్నారు. తన పదవీ కాలంలో ఏఒక్కరినీ తక్కువ చేయకుండా అందరినీ సమాన భావంతో చూశానని చెప్పారు.సిఎస్ గా బాధ్యతలు తీసుకుంటున్న డా.సమీర్ శర్మను తాను ట్రైనీగా ఉన్నప్పుడు నరసాపురం సబ్ కలక్టర్ గా ఉన్నప్పుడు కలిశాని తెలిపారు. ఆయన సమర్ధుడైన అధికారని అంతేగాక ఎప్పటికప్పుడు నూతన భావాలు కలిగిన అధికారని డా.సమీర్ శర్మను ఆదిత్యానాధ్ దాస్ కొనియాడారు. సిఎస్ గా తన కెరీను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కార్యదర్శులు ఇతర అధికారులు, సిబ్బంది అందరికీ పేరుపేరున ధన్యావాదాలు తెలిజేశారు.
ఈవీడ్కోలు సభలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్న డా.సమీర్ శర్మ మాట్లాడుతూ తనకు సాదర స్వాగతం పలుకుతున్న అందిరకీ ముందుగా ధన్యవాదాలు తెలిపారు.ఆదిత్యానాధ్ దాస్ మంచి వ్యక్తిత్వం కలిగిన అధికారని ఆయన తన కుటుంబ స్నేహితుడని చెప్పారు.ఆయన పదవీ విరమణ చేయడం లేదని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా మరో ప్రస్తానాన్ని ప్రారంభించనున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారులు,సిబ్బంది అంతా ఇళ్ళు కుటుంబాలను హైదరాబాదులో వదిలి ఇక్కడ కష్టించి పనిచేయడమంటే సామాన్య విషయం కాదని ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇంకా కష్టమని డా.సమీర్ శర్మ చెప్పారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్యానాధ్ దాస్ మంచి సంస్కారం,విలువలు కలిగిన వ్యక్తని కొనియాడారు. సీనియర్ అధికారులందరికీ అనేక అంశాల్లో నిరంతరం మార్గదర్శనం చేసే వారని పేర్కొన్నారు. డాన్సింగ్ విత్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రచించడం ద్వారా అయనలో మంచి కవి ఉన్నాడని నిరూపించారని తెలిపారు.వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఆదిత్యానాధ్ దాస్ మంచి మానవతావాదని చెప్పారు. అంతేగాక మంచి సమన్వయ కర్తని ఏదైనా సమస్య వచ్చినపుడు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి ఆయా సమస్యలను సామర్యపూర్వకంగా పరిష్కరించే వారని కొనియాడారు. సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్యానాధ్ దాస్ ఎవరినీ నొప్పించకుండా అందరికీ సమానంగా చూశారని చెప్పారు.ఆయన నీటిపారుదల రంగంలో విశేష అనుభవాన్ని గడించినందున ఆయనను వాటర్ మేన్ గా పిలవవచ్చని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సునీత మాట్లాడుతూ ఆదిత్యానాధ్ దాస్ సమర్ధవంతంగా పనిచేశారని, సిఎస్ గా బాధ్యతలు చేపడుతున్న డా.సమీర్ శర్మ పట్టణాభివృద్ధి రంగంలో మంచి నిపుణులని పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ ఆదిత్యానాధ్ దాస్ మంచి మానవతా వాదని పేర్కొన్నారు.రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మాట్లాడుతూ ఆదిత్యానాధ్ దాస్ ఫైళ్ళను చాలా వేగవంతగా క్లియర్ చేసేవారని అన్నారు. ప్రతి ఒక్కరితోను మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారని చెప్పారు.ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ ఆదిత్యానాధ్ దాస్ వారి కాలంలో చాలా సౌక్యవంతంగా పనిచేయగలిగామని అన్నారు. ఇంకా ఈ వీడ్కోలు సభలో పలువురు మాట్లాడారు. తొలుత కార్యక్రమానికి సిఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పి.ప్రశాంతి స్వాగతం పలికారు.
అనంతరం సిఎస్ గా పదవీ విరమణ చేస్తున్న ఆదిత్యానాధ్ దాస్ ను, నూతన సిఎస్ గా బాధ్యతలు చేపడుతున్న డా.సమీర్ శర్మను దుశ్శాలువ, జ్ణాపికలతో ఘణంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాలశాఖ ఇఓ కార్యదర్శి టి.విజయకుమార్ రెడ్డి, ఆర్ధిక శాఖ ఇఓ కార్యదర్శి సత్యనారాయణ, ఇంకా పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ, జిఏడి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …